ప్రాణాలతో చలగాటం ఆడుతున్న డబుల్ బెడ్‌ రూం స్కీం

సొంతింటి కల అనేది అందరికీ ఉంటుంది. ఆ కలను నెరవేర్చుకోవడం కోసం చాలామంది అప్పులు చేసే వాళ్ళని చూసే ఉంటాము. కొందరైతే ఎంతకైనా తెగించేవాళ్లను చూసే ఉంటాము. కానీ ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి మాత్రం ప్రాణాలకు తెగించి మరీ ఇంటి కోసం పోరాటం చేస్తున్నాడు. డబుల్ బెడ్‌ రూం ఇళ్లును దక్కించుకోవడం కోసం ప్రాణాలు కూడా లెక్కచేయటం లేదు.

ప్రాణాలతో చలగాటం ఆడుతున్న డబుల్ బెడ్‌ రూం స్కీం
New Update

ప్రభుత్వం లక్ష్యం..

బీఆర్ఎస్‌ ప్రభుత్వం రూపొందించిన హౌసింగ్ ప్రాజెక్టునే డబుల్ బెడ్‌రూమ్ హౌసింగ్ స్కీం (Double Bedroom Housing Scheme). గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నివాస సదుపాయాలు లేని పేద ప్రజలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి, హైదరాబాద్‌ను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలని ఈ పథకం ద్వారా బీఆర్ఎస్‌ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి 2019 నాటి కల్లా 2.72 లక్షల ఇళ్లను, 2024 నాటికి మరో 3 లక్షల ఇళ్లను ఈ స్కీమ్ కింద నిర్మించబోతున్నారు.

ఇళ్లు ఇవ్వడంపై అసంతృప్తి

బీఆర్ఎస్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ స్కీమ్‌లో ఎన్నో అవకతవకలు ఎదురవుతున్నాయి. అర్హత ఉన్న వాళ్ళకి ఇళ్లు నివ్వకుండా.. కేవలం పార్టీకి సంబంధించిన నాయకుల మనుషులకు మాత్రమే ఇళ్లు ఇవ్వడం పైన చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు కూడా దీనిని విమర్శిస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి డబల్ బెడ్ రూమ్ ఇళ్లు కోసం ఆత్మహత్యాయత్నానికి పాలుపడ్డాడు.

అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేయాలి

సంగారెడ్డి జిల్లా (sangareddy) పుల్కల్ మండల కేంద్రానికి చెందిన బట్టు సుమన్‌ అనే వ్యక్తి డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం బస్సు చక్రాల కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతనికి కాలుపై నుండి బస్సు వెళ్లటంతో తీవ్రంగా గాయపడ్డారు. సమీపాన ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు స్థానికులు. ఘటన చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతగా గొప్పగా నిర్వహిస్తున్న ఈ స్కీమ్‌పై ఇలాంటి అభియోగాలు ఆరోపణలు రావడం చాలా బాధాకరంగా ఉంది. అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేయాలని నిరుపేదలు కోరుకుంటున్నారు.

అంకితభావంతో కృషి 

తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో బంగారు రాష్ట్రంగా అభివృద్ధి చేయడానికి అంకితభావంతో కృషి చేసినందుకు సీఎం కేసీఆర్‌ (cm kcr) అభినందించాలి. వివిధ వర్గాలకు ఆసరా పెన్షన్ పథకం తర్వాత, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో నివసించే తెలంగాణ పేద ప్రజలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను అందించడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దృష్టి పెట్టారు. కానీ ఇలా నీరు పేదలు ఇళ్ల కోసం ప్రాణాలు కోల్పోవటం అనేది చాలా బాధకర విషయం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అర్హులైన పేదలకు అందించే విధంగా చూడాలని సీఎం కేసీఆర్‌ కు విజ్ఞప్తి చేద్దాం.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe