Shahjahan: ఎట్టకేలకు చిక్కిన కామాంధ-భూరక్షసుడు.. షాజహాన్ అరెస్టు!

TMC నాయకుడు షాజహాన్ షేక్‌ను ఎట్టకేలకు పశ్చిమబెంగాల్‌ పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 5 నుంచి షాజహాన్ షేక్ పరారీలో ఉన్నాడు. ఈడీ టీమ్‌పై షాజహాన్‌ వర్గం దాడి, సందేశ్‌ఖాలీలోని మహిళలపై లైంగిక హింస, భూములను లాక్కోవడం లాంటి ఆరోపణలు షాజహాన్‌పై ఉన్నాయి.

New Update
Shahjahan: ఎట్టకేలకు చిక్కిన కామాంధ-భూరక్షసుడు.. షాజహాన్ అరెస్టు!

SandeshKhali Row: పశ్చిమ బెంగాల్‌-సందేశ్‌ఖాలీ హింసాకాండలో ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై దాడి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత షేక్ షాజహాన్‌ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అతడిని తాజాగా అరెస్టు చేశారు. నిందితుడిని మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. ప్రస్తుతం షాజహాన్‌ను బసిర్‌హట్‌లోని పోలీసు లాకప్‌లో ఉంచారు.

అప్పటి నుంచి పరారీలో..:
నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీకి చెందిన మహిళలు షాజహాన్‌పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. షాజహాన్‌ అతని మద్దతుదారుల తమపై లైంగిక దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. భూమి లీజులను కూడా స్వాధీనం చేసుకున్నారని వాపోయారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దరఖాస్తుపై హైకోర్టు గత సోమవారం షాజహాన్ షేక్‌ను అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈడీ అధికారులపై జరిగిన దాడిపై దర్యాప్తు చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), పశ్చిమ బెంగాల్ పోలీసుల సంయుక్త స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటుపై జస్టిస్ టీఎస్ శివజ్ఞానంతో కూడిన సింగిల్ బెంచ్ ఫిబ్రవరి 7న ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత నుంచి షాజహాన్‌ పరారీలో ఉన్నాడు.

వారికి అనుమతి:
సందేశ్‌ఖాలీని సందర్శించేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన ఫ్యాక్ట్ ఫైండింగ్ బృందానికి బుధవారం(ఫిబ్రవరి 28) హైకోర్టు అనుమతి ఇచ్చింది. గత ఆదివారం, కమిటీ ప్రతినిధులు సందేశ్‌ఖాలీకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో కమిటీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కౌశిక్ చంద్ర డివిజన్ బెంచ్ సందేశ్‌ఖాలీకి వెళ్లడానికి ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ టీమ్‌ను అనుమతించింది.

కొనసాగుతోన్న విచారణ:
సందేశ్‌ఖాలీ అంశంపై బీజేపీ, టీఎంసీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. అటు నిరసనలో భాగంగా సందేశ్‌ఖాలీలో జరిగిన హింసాకాండ, లైంగిక వేధింపుల ఘటనలపై విచారణకు బీజేపీ ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో కేంద్ర మంత్రులు, ఆరుగురు పార్లమెంటు సభ్యులు ఉన్నారు. అత్యున్నత స్థాయి కమిటీ కన్వీనర్‌గా కేంద్రమంత్రి అన్నపూర్ణాదేవిని నియమించారు.

Also Read: మహిళలను లైంగికంగా, ఘోరంగా, క్రూరంగా హింసించిన రాక్షసుల కథ ఇది.. అసలేంటి సందేశ్‌ఖాలీ వివాదం?

WATCH:

Advertisment
తాజా కథనాలు