Modi : నువ్వో శక్తి స్వరూపిణివి.. సందేశ్‌ ఖాలీ బాధితురాలితో ఫోన్ లో మోదీ!

ప్రధాని నరేంద్ర మోదీ సందేశ్‌ఖలీ కేసు బాధితురాలు, ఇప్పుడు బీజేపీ అభ్యర్థితో ఫోన్‌లో మాట్లాడారు. ప్రధానమంత్రి రేఖా పాత్ర నుండి ఎన్నికల సన్నాహాల సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ రేఖ పాత్రను 'శక్తి స్వరూపిణి'గా అభివర్ణించారు.

New Update
PM Modi: రేపు ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం.. ఢిల్లీలో నో ఫ్లయింగ్‌ జోన్‌

Rekha Patra : బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ(Sandesh Khali) ప్రాంతానికి చెందిన లైంగిక వేధింపుల బాధితురాలు రేఖా పాత్ర(Rekha Patra) కు బసిర్‌హత్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ(BJP) టికెట్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సందేశ్‌ఖలీ కేసు బాధితురాలితో, ఇప్పుడు బీజేపీ అభ్యర్థితో ఫోన్‌లో మాట్లాడారు. ప్రధానమంత్రి రేఖా పాత్ర నుండి ఎన్నికల సన్నాహాల సమాచారాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ రేఖ పాత్రను 'శక్తి స్వరూపిణి'గా (Sakthi Swaroop) అభివర్ణించారు. బెంగాలీ సినీ నటి నుస్రత్ జహాన్ ప్రస్తుతం బసిర్‌హత్‌ స్థానం నుండి ఎంపీగా ఉన్నారు. అయితే, ఈసారి ఈ స్థానం నుంచి నుస్రత్‌ జహాన్‌కు టీఎంసీ టిక్కెట్‌ ఇవ్వలేదు. టీఎంసీ ఎన్నికల రంగంలో హాజీ నూరుల్ ఇస్లాంను బరిలోకి దింపింది.

సందేశ్‌ ఖాలీ బాధితురాలు రేఖా పాత్ర పేరును బీజేపీ నాయకుడు శుభేందు అధికారి బసిర్‌హత్ టిక్కెట్ కోసం ముందుకు తెచ్చారు. ప్రధాని మోదీ(PM Modi) తో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో రేఖా పాత్ర మాట్లాడుతూ.. మోదీజీ మీరు మా పాలిట దేవుడిలా వచ్చారు. ఆ శ్రీరాముడే మాతో ఉన్నట్లుగా భావిస్తున్నాం. 2011 నుంచి ఇక్కడ ఎవరం ఓటు వేయలేదు. ఈ సారి హక్కును వినియోగించుకునేలా భద్రత కల్పించండి’’ అని కోరారు

దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. బెంగాల్‌ రాజకీయాల గురించి తనకు తెలుసునని.. తాను ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటానని వివరించారు. ఈ సారి ఎన్నికల సంఘం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ ఓటు వేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Also Read : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు