Sandeham : సందేహం రివ్యూ..హెబ్బా పటేల్ నటించిన సినిమా ఎలా ఉందంటే?

సుమన్ తేజా, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘సందేహం’. ఈ చిత్రం జూన్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో విజువల్స్ న్యాచురల్ గా ఉన్నాయని, సాంగ్స్, బీజియం ఆకట్టుకున్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Sandeham : సందేహం రివ్యూ..హెబ్బా పటేల్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
New Update

Sandeham Movie Review : విష్ణు వర్షిని క్రియేషన్స్ బ్యానర్ మీద సుమన్ తేజా, హెబ్బా పటేల్ (Hebah Patel) జంటగా నటించిన చిత్రం ‘సందేహం’. సతీష్ పరమేద దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సత్యనారాయణ నిర్మాతగా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ...

ఈ కథ అంతా కూడా కరోనా టైంలో జరుగుతుంది. హర్ష (సుమన్ తేజా) తనకు ఇష్టమైన అమ్మాయి శ్రుతి (హెబ్బా పటేల్)ని పెళ్లి చేసుకుంటాడు. కానీ శోభనానికి మాత్రం శృతి ఒప్పుకోదు. టైం కావాలని పదే పదే ఆ కార్యాన్ని వాయిదా వేస్తుంటుంది. ఇంతలో వారి ఎదుటి ఫ్లాట్‌లో హర్ష పోలికలతో ఉన్న ఆర్య (సుమన్ తేజా) దిగుతాడు. ఆర్య అంటే ముందు నుంచీ శ్రుతికి ఇష్టం. ఇక హర్ష తన భార్య కోసం చేసిన పనులు ఏంటి? ఆర్య తన ప్రేయసిని దక్కించుకోవడానికి ఏం చేశాడు? మధ్యలో పోలీస్ ఆఫీసర్ శ్వేతా (శ్వేతా వర్మ) పాత్ర ఏంటి? చివరకు ఏం జరుగుతుంది? అనేది కథ.

నటీనటులు...

ఈ చిత్రంలో సుమన్ తేజా పాత్రే హైలెట్‌గా నిలుస్తుంది. డ్యూయెల్ రూల్‌లో అదరగొట్టేశాడు. అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించేందుకు స్కోప్ దొరికినట్టుఅయింది. యాక్షన్, లవ్, ఎమోషన్ ఇలా అన్ని రకాలుగా మెప్పించాడు. హెబ్బా పటేల్ నటన, అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శ్వేతా వర్మ తనకు ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ రోల్‌ను ఎంతో హుందాగా పోషించింది. మిగిలిన పాత్రలన్నీ మెప్పిస్తాయి.

విశ్లేషణ...

ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ఓ జానర్ కిందకు తీసుకురాలేం. ఇందులో కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్నీ ఉంటాయి. ఈ చిత్రాన్ని ముందు చెప్పినట్టుగా ఒకే జానర్‌కు చెందిన సినిమా అని చెప్పలేం. చూస్తున్నంత సేపు ఎక్కడా బోర్ కొట్టించకుండా ముందుకు తీసుకెళ్లాడు. అలా ఎంటర్టైనింగ్‌గా కథను చెప్పడంలో దర్శకుడు సతీష్ సక్సెస్ అయ్యాడు.

ఫస్ట్ హాఫ్‌లో చాలా సరదాగా సాగుతుంది. పెళ్లి సీన్, ఫస్ట్ నైట్ కోసం హీరో పడే తాపత్రయం.. ఇంతలోనే ఎక్స్ అంటూ మరో పాత్ర దిగడం.. ఇలా ముగ్గురి మధ్య జరిగే సీన్లు బాగానే ఉంటాయి. ఇంటర్వెల్‌కు కథ స్వరూపం మారుతుంది. అసలేం జరుగుతోందనే ఆసక్తి ఏర్పడేలా ట్విస్ట్ ఉంటుంది. ఆ తరువాత సెకండాఫ్ ప్రారంభం కాస్త నెమ్మదిగా అనిపించినా.. వెంటనే ఊపందుకుంటుంది. ఇక మెల్లిగా ట్విస్ట్ రివీల్ అవుతుంటుంది. ఎక్కడా బోర్ కొట్టించకుండా ప్రేక్షకుడ్ని ఎంటర్టైన్ చేసేలా కథని, కథనాన్ని రాసుకోవడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.

టెక్నికల్‌గా చూసుకుంటే ఈ చిత్రానికి ప్రధాన బలం విజువల్స్. తెరపై ఆ విజువల్స్ చూస్తుంటే సహజంగా, ఎంతో ఫ్రెష్‌గా అనిపిస్తాయి. మ్యూజిక్, పాటలు, ఆర్ఆర్ అన్నీ బాగుంటాయి. ఎడిటింగ్ టీం బాగానే కష్టపడినట్టుగా కనిపిస్తుంది. మాటలు కొన్ని చోట్ల నవ్విస్తే.. ఇంకొన్ని చోట్ల ఎమోషనల్‌గా అనిపిస్తాయి. నిర్మాత పెట్టిన ప్రతీ పైసా తెరపై అందంగా మారినట్టుగా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి.

రేటింగ్: 3/5

#hebah-patel #sandeham-movie-review
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe