Sandeep Reddy Vanga: దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 2019లో కబీర్ సింగ్ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో షాహిద్ కపూర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలు పోషించారు. సినిమాలో స్త్రీ ద్వేషం, టాక్సిక్ మాస్కులనిటీ వంటి అంశాలను చూపించినందుకు దర్శకుడు ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఆదిల్ హుస్సేన్ కామెంట్స్
ఇది ఇలా ఉంటే.. తాజాగా 'కబీర్ సింగ్'లో షాహిద్ కపూర్ ప్రొఫెసర్ పాత్రను చేసిన ఆదిల్ హుస్సేన్ మాటలను విని విస్తుపోయాడు డైరెక్టర్ సందీప్. ఇటీవలే ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆదిల్ హుస్సేన్.. ముందుగా సినిమా ఎలా ఉంటుందో తనకు తెలియదని. మూవీ చూసిన తర్వాత 20 నిమిషాలకు మించి చూడలేకపోయానని. ఈ సినిమా చేసినందుకు పశ్చాత్తాపపడుతున్నట్లు నటుడు ఆదిల్ తెలిపారు. దీని పై కబీర్ సింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు.
సందీప్ రెడ్డి వంగ ట్వీట్
సందీప్ రెడ్డి వంగా తన ట్వీట్‌లో.. మీరు నటించిన 30 కళాత్మక చిత్రాల్లో ఏ పాత్ర 'కబీర్ సింగ్' మూవీలోని పాత్ర ఇచ్చినంత గుర్తింపు , పేరును ఇవ్వలేదు. నేను కూడా మిమల్ని కాస్టింగ్ చేసినందుకు బాధపడుతున్నాను. మీ అభిరుచి కంటే మీ దురాశ పెద్దదని తెలిసి చింతిస్తున్నాము. ఈ అవమానం నుంచి మిమల్ని రక్షించడానికి AI సహాయంతో మీ ముఖాన్ని మారుస్తాను అంటూ ఆదిల్ హుస్సేన్ వ్యాఖ్యలను ఉద్దేశించి ట్వీట్ చేశారు.