సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) ..నిన్న మొన్నటి వరకు చాలా తక్కువ మందికి మాత్రమే ఈ పేరు తెలుసు. కానీ ఇప్పుడు తీసిన యానిమల్ (Animal) సినిమాతో ఈ పేరు బాగా వినిపిస్తుంది. మొదటి సినిమా అర్జున్ రెడ్డి (Arjun reddy)తో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నప్పటికీ యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో కూడా సందీప్ సంచలనం సృష్టించాడు. తన సినిమాలతో ఎన్ని ప్రశంసలు అందుకున్నాడో అంతకు మించి విమర్శలు కూడా మూట కట్టుకున్నాడు. యానిమల్ సినిమా విడుదలై 10 రోజులు అవుతున్నప్పటికీ కలెక్షన్ల పరంగా ఏమాత్రం తగ్గడం లేదు.
ఇప్పటి వరకు ఈ సినిమా మొత్తంగా రూ. 600 కోట్లు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు సందీప్ ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయాలని ఉందని అన్నారు.
అది కూడా యాక్షన్ డ్రామా సినిమా చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వివరించారు. చిరంజీవి అంటే చాలా ఇష్టమని ఆయన పలు సందర్భాల్లో వివరించారు. యానిమల్ సినిమా ..మహిళల పై ద్వేషం, హింసను ప్రేరేపించేలా ఉందని కొందరు విమర్శలు కురిపిస్తున్నారు. సినిమాని సినిమాలాగే చూడాలని ఆయన కోరారు.
'' ఇక్కడికి వచ్చిన వారిలో నాకు నచ్చిన విషయం ఏంటంటే..మహిళల పై ద్వేషం గురించి ఎవరూ ప్రశ్నించలేదు. మీరు సరైన ప్రేక్షకులు. మీరంతా యానిమల్ ను ఓ సినిమాలానే చూశారు. నాకు చాలా సంతోషంగా ఉంది'' అని సందీప్ చెప్పారు.
Also read: టీడీపీ నుంచి వెళ్లిన కుక్క కొడాలి నాని: బుద్దా వెంకన్న!