Khammam Sand Mafia: ఖమ్మంలో జోరుగా సాగుతున్న ఇసుక మాఫియా!

ఖమ్మం జిల్లా తర్వాత ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో 5 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక డంప్‌ ఉన్నట్టు సమాచారం. దీన్ని తెలంగాణకు చెందిన కొందరు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజూ కనీసం వంద నుంచి 120 లారీల్లో ఇసుకను మన రాష్ట్రంలోకి తరలిస్తున్నారు.

New Update
Khammam Sand Mafia: ఖమ్మంలో జోరుగా సాగుతున్న ఇసుక మాఫియా!

Sand Mafia In Khammam: ఆంధ్రప్రదేశ్‌లోని గుండాల కేంద్రంగా తెలంగాణలో ఇసుక దందా కొనసాగుతోంది. ఒకటి కాదు రెండు ఏకంగా పదుల సంఖ్యలో లారీలు ఇసుక తరలిస్తున్నారు. తాజాగా బూర్గం పాడు పోలీసులు ఇసుక రవాణాను అడ్డుకున్నారు. ఇది గమనించిన లారీ డ్రైవర్లు అద్దాలు పగులగొట్టి మరీ అక్కడి నుంచి పరారయ్యారు. ఇసుక లారీలను పట్టుకున్న విషయం తెలిసి.. వాటిని వెంటనే వదిలేయాలని ఇద్దరు మంత్రుల పీఏలు ఫోన్‌లు చేసి పోలీసులు, అధికారులపై ఒత్తిడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే హైదరాబాద్‌ నుంచి ఓ కీలక అధికారి కూడా ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే, విషయం అప్పటికే బయటకు రావడం, మీడియాలో కూడా రావడంతో ఏమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. చివరకు 11 లారీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 26 లారీలు వస్తే కేవలం 11 లారీలను మాత్రమే సీజ్‌ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ALSO READ: డబుల్ బెడ్రూం పథకంలో స్కాం.. కాగ్ నివేదికలో వెల్లడి

గత కొన్ని రోజులుగా దందా..

ఖమ్మం జిల్లా తర్వాత ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో 5 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక డంప్‌ ఉన్నట్టు సమాచారం. దీన్ని తెలంగాణకు చెందిన కొందరు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజూ కనీసం వంద నుంచి 120 లారీల్లో ఇసుకను మన రాష్ట్రంలోకి తరలిస్తున్నారు. గడిచిన 12 రోజులుగా ఈ దందా కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రతీరోజూ ఈ తరహాలో ఇసుకను తరలించడం వల్ల ఇసుక కాంట్రాక్టర్లకు ఖర్చులన్నీ పోను రూ.కోటి వరకు మిగులుతున్నట్టు తెలుస్తోంది. దీని ప్రకారం లెక్కేస్తే.. 12 రోజుల్లో వీళ్లు ఇక్కడి నుంచి తరలించిన ఇసుకతో రూ.12 కోట్లు అక్రమంగా సంపాదిస్తునట్లు అర్ధం అవుతోంది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: కేసీఆర్‌కు హరీష్ రావు వెన్నుపోటు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

DO WATCH:

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు