/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/ci-1.jpg)
Hyderabad: సనత్ నగర్ ఇన్స్పెక్టర్ పురేందర్ రెడ్డిపై వేటు పడింది. అతన్ని సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సైబరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ తో సీఐ అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆయన పై చర్యలు తీసుకున్నారు. మహిళతో సీఐ అసభ్యంగా చాటింగ్ చేయడంతో ఆమె సైబరాబాద్ సీపీని ఆశ్రయించింది.
సీఐ తనతో చేసిన చాటింగ్ వివరాలను సీపీకి అందజేశారు. సీఐ ఆ చాటింగ్ లో.. అందంగా ఉన్నావు.. చెప్పిన ప్లేస్ కు రావాలి అంటూ మహిళకి అసభ్యకరంగా మెసెజ్‌లు పంపించాడు. దీనికి తోడు తన కేసులో సీఐ అలసత్వం ప్రదర్శించారని సైబరాబాద్ సీపీకి మహిళ ఫిర్యాదు చేసింది.
మహిళ ఫిర్యాదుపై పూర్తి వివరాలు సేకరించిన అనంతరం సీఐపై చర్యలు తీసుకునేందుకు సీపీ నిర్ణయించారు. దీంతో అతన్ని సనత్ నగర్ సీఐ బాధ్యతల నుంచి తప్పిస్తూ సీపీ కార్యాలయానికి బదిలీ చేశారు.
Also read: మాస్టర్స్ డిగ్రీ అందుకున్న అన్నా లెజినోవా… హాజరైన పవన్ కల్యాణ్