/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/sea-jpg.webp)
స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన సబ్ మెరైన్ ‘మత్స్య’ ద్వారా సముద్ర అడుగు భాగంలోకి వెళ్లి.. కోబాల్డ్, నికెల్, మాంగనీస్ వంటి విలువైన మెటల్స్, మినరల్స్ గురించి అన్వేషించనున్నారు. 2024 మొదట్లో చెన్నై తీరం నుండి బంగళాఖాతంలోకి..ముగ్గురు ఆక్వానాట్స్‌ను మత్స్య ద్వారా పంపేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మిషన్ తో నికెల్, కోబాల్ట్, మాంగనీస్, హైడ్రోథర్మల్ సల్ఫైడ్‌లు, గ్యాస్ హైడ్రేట్‌ల అన్వేషణతో పాటు బయో డైవర్సిటీ , సముద్రంలోని టెంపరేచర్స్ గురించి ఇది పరిశీలిస్తుంది. ఈ మిషన్ ద్వారా సముద్రంలోని పర్యవరణానికి ఎలాంటి నష్టం జరగదని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే, ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా మాత్రమే మనుషులు వెళ్లే సబ్ మెరైన్ లను అభివృద్ధి చేశాయి.ఈ మిషన్ సక్సెస్ అయితే ఆ లిస్ట్ లో భారత్ కూడా చేరుతుంది.
ఇటీవల నార్త్ అట్లాంటిక్ ఓషన్ లో టైటానిక్ శిధిలాలను చూసేందుకు.. పర్యాటకులను తీసుకెళ్తుండగా టైటాన్ సబ్ ప్రమాదానికి గురయింది...దీంతో,ఇప్పుడు తయారు చేస్తున్న సబ్ మెరైన్ విషయంలో సైంటిస్టులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ సబ్ మెరైన్ ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ కు చెందిన సైంటిస్టులు తయారు చేస్తున్నారు. డిజైన్, మెటీరియల్, టెస్టింగ్, సర్టిఫికేషన్, స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాలను పరీక్షిస్తున్నారు.
Also Read: మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస..ముగ్గురు మృతి..!!