నువ్వు తప్పు చేస్తున్నావు.. స్టార్ నిర్మాతకు సముద్రఖని సీరియస్ వార్నింగ్

‘పరుత్తివీరన్‌’ సినిమా విషయంలో ఆమిర్‌, నిర్మాత జ్ఞానవేల్‌ రాజా మధ్య గొడవలపై డైరెక్టర్ సముద్రఖని స్పందించారు. ఆమిర్ కు సపోర్టుగా ఓ లెటర్ రిలీజ్ చేశారు. జ్ఞానవేల్‌ ఇదేం బాలేదు. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నీవు వదిలేసిపోతే సినిమా ఆమిర్ పూర్తి చేశారని మండిపడ్డారు.

New Update
నువ్వు తప్పు చేస్తున్నావు.. స్టార్ నిర్మాతకు సముద్రఖని సీరియస్ వార్నింగ్

కార్తి హరోగా 2007లో వచ్చిన ‘పరుత్తివీరన్‌’ సినిమా విషయంలో దాదాపు 16 ఏళ్లుగా చిత్ర దర్శకుడు ఆమిర్‌, నిర్మాత జ్ఞానవేల్‌ రాజా మధ్య గొడవలు నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఇష్యూలోకి ప్రముఖ డైరెక్టర్ సముద్రఖని ఎంటర్ అయ్యారు. ఈ మేరకు మూవీ డైరెక్టర్ ఆమిర్ కు సపోర్టుగా నిలిచాడు. అంతేకాదే ప్రొడ్యూసర్ కు వార్నింగ్ ఇస్తూ ఓ లెటర్ రిలీజ్ చేశారు.

ఈమేరకు ‘పరుత్తివీరన్‌’లో నేనూ నటించాను. ఆ సినిమా తెరకెక్కించడంలో దర్శకుడు ఆమిర్‌ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో నాకు తెలుసు. (జ్ఞానవేల్‌ రాజాని ఉద్దేశించి) నిర్మాతవైన నువ్వు మాత్రం ఒక్కరోజు కూడా సెట్‌కు వచ్చింది లేదు. సినిమా బడ్జెట్‌ విషయంలోనూ సహకరించలేదు. నా వద్ద డబ్బుల్లేవు.. నేను ఈ సినిమా చేయను.. అని షూటింగ్‌ మధ్యలోనే చేతులెత్తేశావు. బంధువుల దగ్గర నుంచి అప్పులు తీసుకువచ్చి ఆమిర్‌ ఆ సినిమా పూర్తి చేశాడు. దానికి నేనే సాక్ష్యం. ఎంతో కష్టపడి ఆయన సినిమా పూర్తి చేస్తే నిర్మాత అనే పేరు మాత్రం నువ్వు పొందావు. ఈరోజు నువ్వు దర్శకుడిని తప్పుబడుతూ వ్యాఖ్యలు చేస్తున్నావు. ఇదేం బాలేదు. నీకింత ధైర్యమెక్కడిది. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు’ అని సముద్రఖని బహిరంగ లేఖ రాశారు.

Also read : కాంగ్రెస్ అధికారంలోకొస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి.. రాహుల్ గాంధీ

ప్రస్తుతం ఈ లేఖ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇక అయితే ఈ గొడవకు కారణమైన ఇష్యూలోకి వస్తే.. కార్తి హీరోగా నటించిన 25 చిత్రం ‘జపాన్‌’. జ్ఞానవేల్‌ రాజా దీనికి నిర్మాతగా వ్యవహరించారు. ఈ నెల ఆరంభంలో చెన్నై వేదికగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు కార్తితో ఇప్పటివరకూ సినిమాలు చేసిన దర్శకులందరూ హాజరయ్యారు. అయితే, తొలి చిత్ర దర్శకుడు ఆమిర్‌ మాత్రం ఈ వేడుకలో కనిపించలేదు. దీనిపై ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘జపాన్‌’ ఈవెంట్‌కు నాకు ఆహ్వానం అందలేదు. సూర్య - కార్తితో నాకు సత్సంబంధాలు లేవు. జ్ఞానవేల్‌ రాజా మా మధ్యలోకి రావడంతోనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి’ అని చెప్పారు. దీనిపై జ్ఞానవేల్‌ రాజా స్పందిస్తూ.. 'అతడికి ఆహ్వానం పంపించాం. ‘పరుత్తివీరన్‌’ విషయంలో నన్ను ఇబ్బందిపెట్టాడు. అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు నాతో ఖర్చుపెట్టించాడు. సరైన లెక్కలు చూపించకుండా నా డబ్బులు దోచుకున్నాడు’ అని ఆరోపణలు చేశాడు.

Advertisment
తాజా కథనాలు