Rahul Dravid's son Samit: అతడు క్రీజులో ఉంటే వికెట్లకు అడ్డంగా గోడ కట్టినట్టే.. బౌలర్లకు సహనం నశింపజేసే ఆ ఓపికకు దండం పెట్టాల్సిందే.. అదెవరో స్పెషల్ గా చెప్పనవసరం లేదు కదా.. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్. రోజుల తరబడి క్రీజులో పాతుకుపోయి ఒక్కోసారి బోర్ అనిపించినా, కట్టిపడేసే కవర్ డ్రైవ్ లతో అలరించడం తనకు అలవాటే.
ఇది కూడా చదవండి: Sakshi Malik: ఇక కుస్తీ పట్టను.. సాక్షి మాలిక్ ఎమోషనల్
ఇప్పుడిదంతా ఎందుకంటే, ద్రవిడ్ కొడుకు సమిత్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అచ్చం తండ్రి శైలిలోనే బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. కూచ్ బెహర్ ట్రోఫీలో బుధవారం జమ్మూకశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో ద్రవిడ్ ను కళ్లకు కట్టినట్టు దింపేశాడు సమిత్. ద్రవిడ్ ను తలపిస్తున్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మ్యాచ్ లో సమిత్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో నిలిచి ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో కర్ణాటక జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లతో బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. ఫ్రంట్‌ఫుట్ షాట్లు, కవర్ డ్రైవ్‌లతో తండ్రిని గుర్తు చేస్తున్నాడంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.