/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ps-jpg.webp)
Alluri Sitarama Raju District: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పుష్ప సినిమా సీన్ రిపీట్ అయింది. గంజాయి తరలిస్తున్న స్మగర్లకు పోలీసులు చుక్కలు చూపించారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. సేమ్ పుష్ప సినిమా తరహాలో గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లను పోలీసులు చేజ్ చేశారు. సినీ పక్కిలో గంజాయి స్మగ్లర్లను వెంటాడారు పోలీసులు. అల్లూరు జిల్లా చిత్రకొండ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. అయితే, అటుగా వస్తున్న బొలెరో వాహనం పోలీసులను లెక్కచేయకుండా వేగంగా దూసుకెళ్లింది. దీంతో పోలీసులు మరో వాహనంలో వారిని వెంబడించారు.
బొలెరో వాహనంలో 980 కేజీల గంజాయిను తరలిస్తున్నారు దుండగులు. పోలీసుల నుండి స్మగ్లర్లు తప్పించుకునేందుకు గంజాయి మూటలను రోడ్డుకు అడ్డంగా వేస్తు వచ్చారు. అయితే ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా స్మగ్లర్ల చేజ్ చేశారు పోలీసులు. ఇక విసుగు చెందిన దుండగులు మార్గ మధ్యలో బొలెరో వాహనం వదిలేసి పరార్ అయ్యారు. సుమారు రూ. కోటి విలువైన గంజాయిని ఒడిస్సా పోలీసులు పట్టుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని ఏపీలోకి తరలిస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.
సినిమాల ప్రభావం జనాల మీద ఏ మాత్రం ఉందో తెలియదు కానీ.. స్మగ్లర్ల (Smugglers) మీద మాత్రం బాగానే ఉంది. అందులోనూ.. ఈ మధ్య వచ్చిన సగ్లింగ్ నేపథ్యమున్న సినిమా పుష్ప (Pushpa movie) ప్రభావమైతే.. విపరీతంగా పడింది. ఫారెస్ట్ అధికారుల కళ్లుగప్పి ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్ చేయాలో పుష్ప సినిమాలో చూపించారు. పుష్ప సినిమాలో స్మగ్లర్ అయిన అల్లు అర్జున్ (Allu Arjun).. కొత్త కొత్త ఐడియాలతో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే.. ఇక్కడ మాత్రం రియల్ స్మగ్లర్లు డ్రగ్స్, గంజాయిని పోలీసుల కంట పడకుండా రాష్ట్రాలు దాటించే క్రమంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయి జైలు పాలవుతున్నారు.
Also Read: భారత్-కెనడా మధ్య ఖలిస్తానీ చిచ్చు..!!