చిన్మయి పిల్లలతో సమంత ఆటపాట!

టాలీవుడ్ నటి సమంత కొద్ది రోజుల క్రితం సినిమాలకు బ్రేక్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి తనకు నచ్చిన ప్రదేశానికి విహార యాత్రకు వెళ్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. స్నేహితులతో కలిసి బాలి దీవుల్లో ఎంజాయ్‌ చేస్తూ చిల్ మూడ్‌ లో ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
చిన్మయి పిల్లలతో సమంత ఆటపాట!

టాలీవుడ్ నటి సమంత కొద్ది రోజుల క్రితం సినిమాలకు బ్రేక్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి తనకు నచ్చిన ప్రదేశానికి విహార యాత్రకు వెళ్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. స్నేహితులతో కలిసి బాలి దీవుల్లో ఎంజాయ్‌ చేస్తూ చిల్ మూడ్‌ లో ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా సమంత బాలి దీవుల నుంచి తిరిగి వచ్చింది. ప్రస్తుతం సమంత చెన్నై వెళ్లింది. అక్కడ తన స్నేహితురాలు, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాద ఇంట్లో ఉన్నట్లు కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో తిరుగుతున్నాయి. అక్కడ చిన్మయి కవల పిల్లలతో ఆటలాడి సందడి చేసింది. వారితో కలిసి నాటు నాటు అంటూ ఆర్‌ ఆర్‌ఆర్‌ లోని పాటకు స్టెప్పులేయించింది.

దీనికి సంబంధించిన వీడియోలను సమంత తన ఇన్‌ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. సమంత చిన్మయి మధ్య ఫ్రెండ్షిప్ ఈనాటిది కాదు. సమంత నటించిన 'ఏ మాయ చేసావే' సినిమాలో సమంత పాత్రకి చిన్మయి డబ్బింగ్ చెప్పింది.

తర్వాత చాలా సినిమాల్లోనూ సమంతకు చిన్మయి డబ్బింగ్ చెప్పగా.. ఆ వాయిస్ తోనే సమంతకు మంచి గుర్తింపు వచ్చింది. అలా వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు. ఇక ఈ ఇద్దరు కేవలం ప్రొఫెషనల్ గానే కాదు.. పర్సనల్ గా కూడా బెస్ట్ ఫ్రెండ్స్. చిన్మయి, హీరో రాహుల్ రవీంద్రన్, కమెడియన్ వెన్నెల కిషోర్ ఇలా అందరూ కలిసి అప్పుడప్పుడు చిల్ అవుతూ ఉంటారు. వీళ్లంతా ఓ గ్యాంగ్ గా సందడి చేస్తూ ఉంటారు.

ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నిన్ను కోరి మూవీ ఫేమ్ శివ నిర్వాణ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గానే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నా రోజా నువ్వే, ఆరాధ్య అనే పాటలు యూట్యూబ్ లో భారీ వ్యూస్ ని అందుకొని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 1వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

Advertisment
తాజా కథనాలు