Samantha : ఆ సాంగ్ లో నటించొద్దని మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు.. అయినా వినలేదు : సమంత

సమంత 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. సామ్ కి ఈసాంగ్ వల్ల పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ వచ్చింది. అయితే ఈ పాటలో నటించవద్దని తన కుటుంబసభ్యులు,స్నేహితులు చెప్పారని సమంత ఇటీవల పాల్గొన్న ఓ ఈవెంట్ లో చెప్పింది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

New Update
Samantha : ఆ సాంగ్ లో నటించొద్దని మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు.. అయినా వినలేదు : సమంత

Samantha Shocking Comments On Pushpa Item Song : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. 'ఊ అంటావా మావా' అంటూ సాగే ఈ సాంగ్ లో సమంత తన అందాలతో ఓ రేంజ్ లో రచ్చ చేసింది. దాంతో సామ్ కి ఈసాంగ్ వల్ల పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ వచ్చింది.

కాగా ఈసాంగ్ కోసం సమంత ఏకంగా ఐదు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ పాటలో నటించవద్దని తన కుటుంబసభ్యులు,స్నేహితులు చెప్పారని సమంత ఇటీవల పాల్గొన్న ఓ ఈవెంట్ లో చెప్పింది.

Also Read : చంపేస్తామని బెదిరిస్తున్నారు, చాలా భయంగా ఉంది.. యాంకర్ శ్యామల ఆవేదన!

వద్దని చెప్పినా వినలేదు...

" నేను విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న సమయంలో 'పుష్ప' సినిమాలోఐటమ్‌ సాంగ్‌లో ఛాన్స్ వచ్చింది. ఆ సాంగ్ లో నటించవద్దని కుటుంబసభ్యులు, సన్నిహితులు చెప్పారు. కానీ నేను వాళ్ల మాట వినకుండా ఆ పాటలో నటించాను. ఆ పాట పెద్ద టర్నింగ్‌ గా మారిన విషయం అందరికీ తెలిసిందే.

నిజం చెప్పాలంటే ఆ అవకాశాన్ని కాదనడానికి నా వద్ద సరైన కారణం లేదు. అలాంటప్పుడు ఎందుకు దాన్ని నిరాకరించాలి, నేను ఏ తప్పు చేయలేదు. మ్యారేజ్ లైఫ్ లో వంద శాతం నిజాయితీగా ఉన్నాను. అయితే అది నాకు వర్కౌట్‌ కాలేదు" అని తెలిపింది. దీంతో సమంత చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు