AP News: జనసేనాని కోసం ఆ గ్రామస్తుల వినూత్న మొక్కులు.. ఊరంతా కోళ్లతో!

పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో గెలవడంతోపాటు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై ఏపీలోని సమనస గ్రామస్తులు సంబరాల్లో మునిగితేలారు. ఊరంతా కలిసి పోలేరమ్మకు కోళ్లతో మొక్కులు చెల్లించారు. పలు రకాల నైవేద్యాలు సమర్పించి పవన్ పై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరారు.

New Update
AP News: జనసేనాని కోసం ఆ గ్రామస్తుల వినూత్న మొక్కులు.. ఊరంతా కోళ్లతో!

Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో అభిమానులు పెద్ద ఎత్తున్న సంబరాలు చేసుకుంటున్నారు. దేవుళ్లకు మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనసలో ఊరంతా కలిసి కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు చెల్లించారు. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని పోలేరమ్మకు పూజ చేసి వెండి పూలతో విజయ దండ వేసిన గ్రామస్తులు.. పవన్ కళ్యాణ్ విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పోలేరమ్మకు గ్రామస్తులు అంతా ఒక్కటై మొక్కులు తీర్చుకున్నారు.

పవన్ కళ్యాణ్ మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. పవన్ అనుకున్న లక్ష్యం నెరవేరడంతో సమనస ఊరు ఊరంత పండగ కోలాహలంగా మారిందని చెప్పారు. గ్రామదేవత పోలేరమ్మ సాక్షిగా నైవేద్యంలతో అమ్మవారికి పూజలు చేసినట్ల తెలిపారు. పవన్ ప్రతి విజయం వెనుక పోలేరమ్మ ఆశీస్సులు ఉండాలని, భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలను పవన్ అధిరోహించాలని పోలేరమ్మవారికి గ్రామస్తుల ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు