Salaar OTT Release: ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఆసక్తిగా ఎదుచూసిన సలార్ నేడు థియేటర్స్ లో విడుదలైంది. బాహుబలి సినిమా తర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్, సినిమాలు ప్రభాస్ అభిమానులను అంతగా మెప్పించలేకపోయాయి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ పైనే పెట్టుకున్నారు. సలార్ టీజర్ లో ప్రభాస్ కటౌట్, ట్రైలర్ లోని యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షకులలో అంచనాలను భారీగా పెంచేసింది. నేడు విడుదలైన సలార్ అంచనాలకు తగ్గట్లుగానే బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే ఫస్ట్ షోకే సినిమా పై హిట్ టాక్ మొదలైంది. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషంలో తేలిపోతున్నారు. ఇక ప్రభాస్ అభిమానులు రికార్డుల వేట మొదలైంది అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఖాతాలో ఈ సినిమా మరో భారీ హిట్ అవ్వబోతుందని చెబుతున్నారు.
సాధారణంగా థియేటర్స్ లో విడుదలైన ప్రతీ సినిమా నెల రోజుల తరువాత ఓటీటీలో స్ట్రీమ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. కొన్ని సినిమాల్లో ఇది బిన్నంగా కూడా ఉండొచ్చు. సినిమా పై ప్రేక్షకుల రెస్పాన్స్ ఆధారంగా రిలీజ్ లో తేడా ఉంటుంది. ఇక తాజాగా విడుదలైన సలార్ ఓటీటీ స్ట్రీమింగ్ పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
సలార్ రిలీజైన ఒక్క రోజులోనే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఎవరు సొంతం చేసుకున్నారనే దాని పై టాక్ మొదలైంది. అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 160 కోట్లు ఖర్చు చేసి సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు నెట్టింట్లో ప్రచారం జరుగుతుంది. దీన్ని బట్టి సలార్ నెల రోజుల తర్వాత ఓటీటీ లో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది. జనవరి నెలలో సంక్రాంతి లేదా జనవరి 26 న విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
Also Read: Salaar Review: ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే సలార్.. ప్రభాస్ హిట్ కొట్టాడా?