Salaar Movie Review in Telugu: కొన్ని సినిమాలు కథ కోసం చూస్తాం.. మరికొన్ని హీరో కోసం చూస్తాం. కథతో సంబంధం లేకుండా హీరో కోసమే చూసే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి సినిమాల్లో ప్రభాస్ సినిమాలు మొదటి వరుసలో ఉంటాయి. సినిమా ఎలా ఉందనేది సెకండరీ.. మొదట ప్రభాస్ (Prabhas) సినిమా అంతే. అభిమానులకే కాదు.. ప్రేక్షకులందరిదీ దాదాపుగా ఇదే ధోరణి. ప్రభాస్ సినిమా అంటే మొన్నటివరకూ తెలుగు రాష్ట్రాల్లోనే ఆ పరిస్థితి ఉండేది. కానీ, బాహుబలి తరువాత ఆ ధోరణి ప్రపంచవ్యాప్తం అయింది. ఇప్పుడు ప్రభాస్ సలార్ గా ప్రపంచ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిజానికి బాహుబలి (Baahubali) తరువాత ప్రభాస్ కి హిట్ లేదు. అంటే.. అందరికీ నచ్చేలా ప్రభాస్ ని చూపించిన సినిమా లేదు. కొంత వరకూ సాహో ఫర్వాలేదు అనిపించినా.. రాధేశ్యామ్.. ఆదిపురుష్ సినిమాలు పూర్తిగా నిరాశపరిచాయి. కథ, కథనాల పరంగానే కాకుండా ప్రభాస్ లుక్స్ పరంగా కూడా ఈ సినిమాలు అందరినీ పూర్తిగా నిరాశపరిచాయి. పరోపక్క ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ (KGF) సినిమా రెండు పార్టులతో టాప్ దర్శకుల లిస్ట్ లో చేరిపోయాడు. ఆ రెండు హిట్స్ తరువాత ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సినిమా అనేసరికి ఎక్స్ పెక్టేషన్స్ ఒక రేంజ్ లో వచ్చేశాయి. సినిమా ట్రైలర్స్.. సింగిల్స్ దానిని మరో లెవెల్ కి తీసుకుపోయాయి. ఎంత అంటే.. సినిమా రిలీజ్ కంటే ముందే మొదటి రోజు ఒక్కరోజే కోట్లాది రూపాయలు కొల్లగొట్టి రికార్డులు సృష్టించేంతగా. మరి సలార్(Salaar Review) అందరినీ మెప్పించాడా? గత సినిమాల స్థాయిలో ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దీనిని నిలబెట్టాడా? తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Salaar Review: ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే సలార్.. ప్రభాస్ హిట్ కొట్టాడా?
చాలాకాలం నుంచి ప్రపంచ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ థియేటర్లలో వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ అభిమానులను అలరిస్తోంది. యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. పూర్తి రివ్యూ కోసం హెడింగ్ పై క్లిక్ చేయండి.
Translate this News: