డార్లింగ్ ఫాన్స్‌ను ఆకట్టుకుంటున్న సలార్ టీజర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సలార్ టీజర్ రానే వచ్చింది. ఈ కేజీఎఫ్ మూవీస్‌తో దేశం చూపును తనవైపు తిప్పుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈరోజు తెల్లవారుజామున మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. By Vijaya Nimma 06 Jul 2023 in సినిమా Scrolling New Update షేర్ చేయండి దుమ్ము లేపిన సలార్ టీజర్ ఈ సినిమా ఎలా ఉండబోతోంది? హీరో ప్రభాస్ పాత్ర ఎంతగా ఎలివేట్ చేశారు? అనేది ఒక్క డైలాగ్‌తో మేకర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా ప్రమాదకరం.. కానీ జురాసిక్ పార్కులో కాదు..ఎందుకంటే అక్కడ ఉండేది.. అంటూ టీనూ ఆనంద్ డైలాగ్‌తో మొదలైన టీజర్ అభిమానుల్లో అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ మూవీలో ప్రభాస్ మాస్ విశ్వరూపం కనిపించబోతోందని చెప్పకనే చెప్పేసింది. ఒకేఒక పవర్‌ఫూల్ డైలాగ్ అయితే కేజీఎఫ్ మార్కు టేకింగ్ ఉన్న సీన్స్‌తో ప్రభాస్‌ను కనిపించీ కనిపించనట్టుగా క్షణకాలంలో ఇంట్రడ్యూస్ చేయడం మరో విశేషం. నేటి తరం, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఏ కోరుకుంటున్నారో అదే తెరపై చూపించేందుకు దర్శకుడు పక్కా ప్రణాళిక వేసుకున్నాడనేది టీజర్‌తోనే తెలిసిపోయిందనేది అభిమానులు చెప్పే మాట. టీజర్ చివరల్లో పృథ్వీరాజ్ ఇంట్రడక్షన్ కూడా అదుర్స్ అనేది పబ్లిక్ టాక్. ఈ టీజర్‌తో ప్రభాస్ అభిమానుల్లో ఉత్కంఠ పతాకస్థాయికి చేరుకోవడం పక్కా అనడంలో ఎటువంటి అతిశయోక్తీ ఉండదేమో. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. పార్ట్-1సెప్టెంబర్ 28న విడుదల ఈ మూవీ మరోవైపు, కేజీఎఫ్ 2 క్లైమాక్స్‌కు సలార్ టీజర్‌కు లింక్ ఉంటుందని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్ 2 క్లైమాక్స్‌లో రాకీ బాయ్ సముద్రంలో మునిగే సమయంకు సలార్ టీజర్ రిలీజ్ టైమ్‍కు నెటిజన్లు లింక్ పెట్టారు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే సలార్ టీజర్ మూవీకోసం వేచిచూడాలి. సలార్ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‍గా శృతిహాసన్ నటిస్తోంది. విలన్‍గా మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. జగపతి బాబు, మధు గురుస్వామి, ఈశ్వరి రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. కేజీఎఫ్‍ను నిర్మించిన హొంబాలే ఫిల్మ్స్ బ్యానర్.. ఈ సలార్ మూవీని కూడా ప్రొడ్యూజ్ చేస్తోంది. సలార్ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని చిత్రయూనిట్ వెల్లడించింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి