Salaar Movie: రిలీజ్ కు ముందే రూ.175 కోట్ల కలెక్షన్స్‌.. దిమ్మతిరిగేలా సలార్ క్రేజ్‌..!

డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ. 175 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.

New Update
Salaar Movie: రిలీజ్ కు ముందే రూ.175 కోట్ల కలెక్షన్స్‌..  దిమ్మతిరిగేలా సలార్ క్రేజ్‌..!

Salaar Movie Pre Release Business Collection: ప్రభాస్ సినిమా అంటేనే చాలు.. అభిమానులు పండుగ చేసుకుంటారు. ఆయన సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ప్రేక్షకులు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్ (Prabhas). ఇక ప్రభాస్ తీసే ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దర్శకులు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో వస్తున్న 'సలార్' సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దాదాపు కరోనా కాలం కంటే ముందే ప్రారంభించిన ఈ సినిమా ఇంకా షూటింగ్ పనుల్లో బిజీగానే ఉంది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిసింది. ఫస్ట్ పార్ట్ సలార్ 'సీజ్ ది ఫైర్' అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 22 న థియేటర్స్ లో విడుదల కానున్నట్లు ప్రకటించారు చిత్ర చూనిట్.

Also Read: దుమ్ములేపేశాడుగా.. బాలయ్య బాబు సినిమా కలెక్షన్లు చూస్తే పిచ్చెక్కాల్సిందే భయ్యా!

publive-image

కేజీఎఫ్ (KGF) ఫేం ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియన్  స్టార్ ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ 'సలార్'. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ లెక్కలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు.. చూస్తుంటే ఆకాశానికి తాకేలానే ఉన్నాయి. ఇక ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా రికార్డు ధరకు అమ్ముడుపోతున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ దాదాపు రూ. 175 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. రిలీజ్ కు ముందే రికార్డులను చెరిపేస్తున్న ఈ సినిమా.. రిలీజ్ అయిన తరువాత హిట్ కొట్టిందంటే ఇక మూవీ మేకర్స్ కు పండగే.

publive-image

Also Read: Varun, Lavanya Wedding: వరుణ్, లావణ్య పెళ్లి కోసం ఇటలీకి పవర్ స్టార్ ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు