Salaar Advance : వరల్డ్ వైడ్ గా సలార్ మోత.. ప్రీరిలీజ్ బుకింగ్స్ రేంజ్ అదిరిపోయింది 

ప్రభాస్ కొత్త సినిమా సలార్ పాన్ వరల్డ్ సినిమాగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తాజాగా ఈ ఓపెనింగ్స్ 6 లక్షల డాలర్ల మార్క్ ను చేరుకున్నాయని మేకర్స్ X వేదికగా తెలిపారు. దీంతో అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. 

Salaar Advance : వరల్డ్ వైడ్ గా సలార్ మోత.. ప్రీరిలీజ్ బుకింగ్స్ రేంజ్ అదిరిపోయింది 
New Update

Salaar Pre-Release Bookings : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) కొత్త సినిమా సలార్(Salaar). వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 22న విడుదలకు సిద్ధం అవుతోంది. సినిమా విడుదలకు ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. దీంతో సినిమా నుంచి రోజుకో అప్ డేట్ వస్తూ ఉంది. మేకర్స్ సినిమా రిలీజ్ కోసం భారీ సన్నాహాలు మొదలు పెట్టారు. గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్(Salaar Pre-Release Bookings) చాలా క్రితం కిందే ప్రారంభం అయ్యాయి. సలార్ యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో ఉన్నాయని మేకర్స్ చెబుతున్నారు. యూఎస్ మార్కెట్లో ప్రత్యంగిర సినిమాస్ విడుదల చేస్తోంది. వాళ్ళిస్తున్న అప్ డేట్ ప్రకారం సినిమా అడ్వాన్స్ కలెక్షన్స్.. ఆరు లక్షల డాలర్ల మార్క్ ని అందుకున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే.. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే మిలియన్ డాలర్లు సినిమా రిలీజ్ సమయానికే వచ్చేస్తాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు షారూక్ ఖాన్ నటించిన డింకీ సినిమా కూడా అదే సమయంలో విడుదల అవుతోంది. అయితే, దాని అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికీ ఒక మోస్తరుగానే ఉన్నాయని సమాచారం. 

ప్రభాస్ మేనియా ఏ రేంజిలో ఉన్నాయో ఈ అడ్వాన్స్ బుకింగ్స్ చెబుతున్నాయని ఫాన్స్ అంటున్నారు. ఇప్పటికే సరైన ప్రమోషన్స్ లేవని అలిగిన ఫ్యాన్స్ కు ఇప్పుడు ఈ వార్త మంచి జోష్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు కొత్త ట్రైలర్ అలాగే సాంగ్ విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే చెప్పారు. దీంతో అవి వస్తే, మరింత స్పీడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటాయని భావిస్తున్నారు. ప్రీమియర్ రేంజి ఎంత ఉంటుందో ఇప్పుడు ఊహించడం కూడా కష్టం అని అభిమానులు అంటున్నారు. 

Also Read: మొదటిదానిలో దేవా..రెండో దానిలో సలార్..ట్రైలర్ ఇరగదీయాల్సిందే

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు అంతగా మెప్పించలేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ మూవీపైనే పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ గురించి హైప్ చాలా ఎక్కువగానే ఉంది. ముందు వచ్చిన కేజీఎఫ్ (KGF) సంచలనం సృష్టించడంతో పలార్ మీద కూడా అందరూ అంచనాలను పెట్టుకున్నారు. మరోవైపు ప్రభాస్ (Prabhas) కూడా కొన్నేళ్ల తర్వాత ఫుల్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. 

ఇప్పటికే విడుదలైన సలార్ పోస్టర్స్, టీజర్ (Salaar Teaser) సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. దీనితో ఈ సినిమా ఏ రేంజ్‏లో ఉంటుందో చెప్పేశారు ప్రశాంత్ నీల్ (Prashanth Neel). ప్రభాస్ అభిమానులు ఊహించని రీతిలో మాస్ యాక్షన్ కంటెంట్ ఈ సినిమాలో ఉండనుందని తెలుస్తోంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీ విడుదల పెద్ద పండగే. తాజాగా సలార్ సెకండ్ ట్రైలర్ గురించి మరో క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. మొదటి ట్రైలర్ లో దేవా వెర్షన్ లో ప్రభాస్ సందడి చేయగా.. ఇప్పుడు సలార్ గా డార్లింగ్ ని చూపిస్తూ మరో ట్రైలర్ ను విడుదల చేస్తారని చెబుతున్నారు. దేవా నుండి సలార్ గా ప్రభాస్ ఎలా మారాడు అన్న విషయం సెకండ్ ట్రైలర్ లో ఉండనుందని బజ్ వినిపిస్తోంది.

Watch this interesting Video:

#prabhas #salaar-movie
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe