Sajjanar Comments On Free Bus Scheme : కాంగ్రెస్(Congress) ప్రభుత్వం మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వసతి కల్పించిన విషయం తెలిసిందే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలతో ఆర్టీసీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా టీఎస్ఆర్టీసీ(TSRTC) ఎండీ వీసీ సజ్జనర్(MD VC Sajjanar) మహిళలకు ఉచిత ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రద్దీని నియంత్రించేందుకు మహిళలకు ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. తక్కువ దూరం వెళ్లే మహిళలు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణిస్తున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని అన్నారు. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లెవెలుగు బస్సు ఎక్కాలని విజ్ఞప్తి చేశారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యం ఇచ్చి సిబ్బందికి సహకరించాలని అన్నారు. ఇకపై అనుమతించిన స్టేజీల్లోనే బస్సులు ఆపనున్నట్లు స్పష్టం చేశారు.
ALSO READ: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. వీరికే కొత్త రేషన్ కార్డులు!
ఆయన ట్విట్టర్(X) లో.. 'మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాం. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోంది. ఇక నుంచి ఎక్స్ ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.' అని తెలిపారు.
ALSO READ: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సజ్జనార్ కీలక ప్రకటన