Sajjala: వైఎస్ ఫ్యామిలీని కాంగ్రెస్ వేధించింది.. షర్మిలపై సజ్జల సంచలన వాఖ్యలు

వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ వేధించిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని షర్మిల నిర్ణయం తీసుకోవడం ఆమె ఇష్టమన్నారు. జగన్ పై కాంగ్రెస్ పార్టీ అక్రమంగా కేసులు పెట్టిన విషయం అందరికీ తెలుసన్నారు.

New Update
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది.. సజ్జల హాట్ కామెంట్స్

తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections 2023) పోటీకి దూరంగా ఉంటామని వైఎస్సార్టీపీ (YSRTP) అధినేత్రి షర్మిల చేసిన ప్రకటనపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishnareddy) సంచలన వాఖ్యలు చేశారు. షర్మిల ఓ పార్టీకి అధ్యక్షురాలని.. ఆమె నిర్ణయాలు ఆవిడ ఇష్టమన్నారు. తమకు ఈ రాష్ట్రానికి చెందిన విషయాలే ముఖ్యమని స్పష్టం చేశారు. వైఎస్సార్ ఫ్యామిలీని కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందనే విషయం అందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీ జగన్ పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతు ప్రకటించిన వేళ సజ్జల చేసిన ఈ వాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. ఇదిలా ఉంటే.. చంద్రబాబు కేసులపై కూడా సజ్జల మరోసారి స్పందించారు. చంద్రబాబు చాలా కుంభకోణాలు చేశారు కాబట్టే ఇవన్ని కేసులు ఉన్నాయన్నారు.
ఇది కూడా చదవండి: Buggana: ఇందుకే జీతాలు,పెన్షన్ల జాప్యం..బుగ్గన సంచలన వ్యాఖ్యలు.!

ఆధారాలు ఉన్నందునే ఆయనపై కేసులు పెట్టారన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక అన్నారు కానీ.. ఫ్రీగా ఎక్కడైనా దొరికిందా? అని ప్రశ్నించారు. ఉచిత ఇసుక అంటే ఎవరికి వాళ్లే తెచ్చుకోవాలన్నరు. కానీ పెద్ద పెద్ద ప్రొక్లయినర్లు పెట్టి దందా చేశారని ఆరోపించారు. ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము నొక్కేశారని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: AP Caste Census: ఏపీలో ఈ నెల 15 నుంచి కుల గణన.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

నియమాలు పాటించకుండా.. క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండా దోచుకున్నారన్నారు. చట్టానికి విరుద్ధంగా చేశారు కాబట్టే.. చట్ట ప్రకారం కేసు పెట్టారన్నారు. ఇసుక పై ప్రభుత్వానికి ప్రస్తుతం ఏడాదికి రూ.765 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తోందన్నారు. గతంలో ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. పురందేశ్వరి బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలా? టీడీపీకి ఉపాధ్యక్షురాలా? అని ప్రశ్నించారు.

Advertisment
తాజా కథనాలు