Sajjala Ramakrishna Reddy: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ క్రిష్ణ రెడ్డి కౌంటర్లు వేశారు. లోకేష్ వైసీపీ కి భయం పరిచయం చేస్తా అంటున్నాడని.. అయితే, లోకేష్ ఒక జోకర్ అని వ్యంగ్యంగా మాట్లాడారు.. పవన్ కల్యాణ్ కి ఏ ప్రలోభాలు పెట్టారో పక్కన పెడితే..చంద్రబాబు కి 175 నియోజకవర్గాలకు అభ్యర్థులు వున్నారా? అని ప్రశ్నించారు. గతంలో నిరోద్యుగ బృతి రెండు వేలు ఇస్తామని ఇచ్చారా?..లోకేష్ మళ్ళీ మూడు వేల నిరుద్యోగ భృతి అంటున్నారని అన్నారు.
పవన్, చంద్రబాబు, లోకేష్ వీరంతా ఉండేది పక్క రాష్ట్రంలో అయితే, పెత్తనం చేయాలి అనుకునేది మాత్రం ఏపీ లోనని విమర్శనాస్త్రాలు సంధించారు. 2014 నుంచి 2018 మధ్య చంద్రబాబు కనీసం ఒక్క పథకం అయినా పూర్తిగా అమలు చేశారా? అని సజ్జల ప్రశ్నించారు. గతంలో ఉచిత ఇసుక అన్నారు.. మరి ఇసుక ఉచితం అయితే నాటి దెందులూరు ఎమ్మెల్యే ఎమ్మార్వో జుట్టు ఎందుకు పట్టుకోవాల్సి వచ్చిందని నిలదీశారు. ఇసుక ఉచితం అయితే జేసీబీలు పెట్టాల్సిన అవసరం ఏంటి? నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఎందుకు రూ.100 కోట్ల జరిమానా విధించింది? అంటూ సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also read : రైతుబంధుపై మంత్రులు మాట్లాడితే నోటీసులు ఇవ్వండి.. బిఆర్ఎస్ ఎంపీ షాకింగ్ కామెంట్స్.!
చంద్రబాబు ఏమైనా పథకాలు తీసుకువస్తే కదా.. వాటిని జగన్ ఆపడానికి అంటూ వ్యాఖ్యానించారు. ఏ పార్టీ అని చూడకుండా జగన్ అందరికీ పథకాలు వర్తింపజేస్తున్నారని, టీడీపీ మద్దతుదారులకు ఒక్క పథకం ఆగిందని ఎవరైనా చెప్పగలరా? అని సజ్జల సవాల్ విసిరారు. జగన్ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు.
ఈ క్రమంలోనే కాకినాడ వైద్యుడు ఆత్మహత్యలో వైసీపీ నేతలకు ఏమి సంబంధం? అని వ్యాఖ్యనించారు. డబ్బులు ఇచ్చి నష్ట పోయింది ఎవరు? చనిపోయిన వ్యక్తి తల్లే వైసీపీ నేతలకు సంబంధం లేదని చెబుతోంది. టీడీపీ తీసుకువచ్చిన 100 పథకాలను మేం నిలిపివేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.