Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్ దాడిపై ప్రతిపక్షాలు అన్నీ ఒకే లైన్ లో ఉన్నాయన్నారు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఉద్దేశపూర్వకంగా కావాలనే దాడి చేయించుకున్నారని టీడీపీ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. నింద టీడీపీ మీదకు వస్తుందని భయపడుతున్నారన్నారు. డ్రామా అని టీడీపీ చెప్పడం వెనుక వారి భయం కనిపిస్తుందని కామెంట్స్ చేశారు.
Also Read: జగన్ పై దాడి చేసింది వాళ్లే.. దమ్ముంటే సీబీఐ చేత విచారణ జరిపించండి..!
సీఎం జగన్ కు జనంలో వస్తున్న ఆదరణతో భయం పట్టుకుందని పేర్కొన్నారు. దూరం నుంచి రాయితో ఎవరైనా కొట్టించుకుంటారా? అని ప్రశ్నించారు. సింపతీ కోసం సీఎం జగన్ కు డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదన్నారు. భద్రతా వైఫల్యం అంటూ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
Also Read: ఆ కర్మ మా నాయకుడికి లేదు.. బీజేపీని ఎందుకు ఒప్పించలేకపొయారు..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియదని కౌంటర్ వేశారు. సీఎం జగన్ పై అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారుని మండిపడ్డారు. దాడి ఘటనలో బాదితులం తామని అయితే సీబీఐ విచారణ చేయమని వాళ్లు కోరుతున్నారన్నారు. టీడీపీ ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా జగన్ గెలుపును ఆపలేరన్నారు.