Saindhav Movie: సైంధవ్ మూవీ ప్రమోషన్స్.. సరదాగా కాలేజీలో క్రికెట్ ఆడిన వెంకటేష్

శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం సైంధవ్‌. ఈ సినిమా 2024 లో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ సందర్భంగా వెంకటేష్, టీమ్ కాలేజీ విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

New Update
Saindhav Movie: సైంధవ్  మూవీ ప్రమోషన్స్.. సరదాగా కాలేజీలో క్రికెట్ ఆడిన వెంకటేష్

Saindhav Movie: విక్టరి వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం సైంధవ్‌. వెంకటేష్ 75 వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయిని పల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13 న సైంధవ్‌ ప్రపంచవ్యాప్తతంగా విడుదల కానుంది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. సినిమా రిలీజ్ ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సైంధవ్‌ టీమ్ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. రీసెంట్ విడుదలైన సైంధవ్‌ గ్లింప్స్ సినిమా పై అంచనాలను మరింత పెంచుతోంది. మేకర్స్ ఇప్పటికే షేర్ చేసిన సైందవ్ సినిమాలోని పాత్రల ఇంట్రడక్షన్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

publive-image

తాజాగా సాంగ్ లంచ్ ఈవెంట్ లో భాగంగా సైంధవ్ టీమ్ విజయవాడ, గుంటూరు లో సందడి చేసింది. ఈ సందర్భంగా హీరో వెంకటేష్, శైలేష్ కొలను, శ్రద్ధా శ్రీనాథ్‌ అండ్ చిత్ర బృందం VVIT  కాలేజీ విద్యార్థులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సైంధవ్‌ చిత్రంలో  శ్రద్ధా శ్రీనాథ్‌ రుహానీ శర్మ , నవాజుద్దీన్, కోలీవుడ్ యాక్టర్ ఆర్య మానస్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

publive-image

Thandel: నాగ చైతన్య 'తండేల్' షూటింగ్.. ఎక్కడో తెలుసా..? - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు