/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/saichandu-jpg.webp)
గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ సంస్మరణ సభ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. సాయిచంద్ స్మారక సభలో సతీమణి గిడ్డంగుల చైర్మన్ వేద రజిని.. సాయిచంద్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాయిచంద్ చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అంతేకాకుండా ఓయూ ప్రొఫెసర్ కాశీరాంతో పాటు వివిధ జానపద కళాకారులు, ప్రొఫెసర్, విద్యార్థులు సాయిచంద్‌తో ఉన్న బంధాన్ని, స్నేహాన్ని, పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తన జీవితం తెలంగాణ ప్రజల కోసం పాట ద్వారా నిరంతరం కృషి చేశారని సాయిచంద్ భార్య రజిని చెప్పారు.
చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న సాయిచంద్.. ఉన్నతస్థాయికి ఎదిగే క్రమంలో అకాల మరణం కోట్ల మందిని బాధ కలిగించింది. ఆయన మరణంపై సీఎం సంతాపాన్ని ప్రకటించారు. సాయిచంద్ కుటుంబ సభ్యులు అండగా ఉంటామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది.
తెలంగాణ ప్రముఖ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. సాయిచంద్ కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్‌కి వెళ్లి..అర్ధరాత్రి సాయిచంద్ తీవ్ర అస్వస్థకు గురైయ్యారు.ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు డాక్టర్లు గుండెపోటుగా నిర్థారించటంతో.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు సాయిచంద్‌ను తరలించారు. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయిచంద్ కన్నుమూశారు. సాయిచంద్ మరణంపై సీఎం కేసీఆర్, మంత్రులు, బీఆర్ఎస్ నేతలు సంతాపాన్ని తెలియజేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.