Sai Tej : పేరు మార్చుకున్న సాయిధరమ్‌ తేజ్ ..ఇక నుంచి ఆ పేరుతోనే

హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తన పేరును మార్చుకున్నట్లు ప్రకటించాడు. ఇక నుంచి తన పేరులో తల్లి పేరు దుర్గను చేర్చుకుని సాయి దుర్గా తేజ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించాడు.

Sai Tej : పేరు మార్చుకున్న సాయిధరమ్‌ తేజ్ ..ఇక నుంచి ఆ పేరుతోనే
New Update

Sai Durga Tej : చిరంజీవి(Chiranjeevi) ముద్దుల మేనల్లుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన సాయి ధరమ్‌ తేజ్(Sai Tej) ..తన నటన, డ్యాన్సులతో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. తక్కువ కాలంలోనే అభిమానుల్లో మంచి ఇమేజ్‌ ను క్రియేట్‌ చేసుకున్నాడు. వరుస సినిమాలు చేస్తున్న క్రమంలో ఓ యాక్సిడెంట్ అతని జీవితాన్ని మార్చేసింది.

ఆ ప్రమాదం తరువాత సాయితేజ్‌ చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ తరువాత బ్రో సినిమా చేసినప్పటికీ అది అంత పెద్దగా హిట్‌ కాలేదు. ఆ తరువాత వచ్చిన విరూపాక్ష మాత్రం సూపర్‌ హిట్‌ ని సొంతం చేసుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకోని సాయి తేజ్‌ , స్వాతి(Swathi) నటించిన సత్య(Satya)  అనే షార్ట్ ఫిలింను మళ్లీ ప్రసారం చేశారు.

ఈ క్రమంలో విలేకర్ల సమావేశంలో సాయి తేజ్‌ ను కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో సాయి జీవితంలో ముఖ్య పాత్ర పోషించిన మహిళల గురించి వివరించమంటే సాయి తేజ్‌ తన అమ్మ, పిన్ని , అమ్మమ్మ లేకపోతే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా సాయి తేజ్‌ మరో విషయాన్ని కూడా ప్రకటించాడు.

అది ఏంటంటే..ఇక నుంచి తన పేరులో తల్లి పేరును చేర్చుకుని సాయి దుర్గ తేజ్‌ గా మారబోతున్నట్లు వివరించాడు. తన తండ్రి పేరు ఎలాగూ ఇంటి పేరుతో కలిసి వస్తుందని, తల్లి పేరును మాత్రం ఎందుకు దూరం చేసుకోవాలని సాయి తేజ్‌ అన్నాడు. ఇక నుంచి తన పేరు సాయి దుర్గ తేజ్‌(Sai Durgha Tej) గా మారిందని చెప్పుకొచ్చాడు.

Also read: వైసీపీ 11 వ జాబితా విడుదల..ఈ సారి లిస్ట్ లో రాపాక!

#sai-durgha-tej #pawan-kalyan #movies #sai-tej #chiranjeevi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe