/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-47-1-jpg.webp)
Sai Sudarshan: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ తొలి రెండు మ్యాచుల్లోనూ అదరగొట్టే బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న టీమిండియా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ మూడో మ్యాచ్ లో తన ఫీల్డింగ్ నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలు పొందాడు. సిరీస్ విజేతను నిర్ణయించే కీలకమైన మూడో వన్డేలో ఈ యువ ఓపెనర్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకుని ఔరా అనిపించాడు.
Catch of the series - Sai Sudharsan 🫡🔥pic.twitter.com/tKr2Vrj3tq
— Johns. (@CricCrazyJohns) December 21, 2023
టీమిండియా పేసర్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో (32.2వ ఓవర్) మిడాఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సాయి అద్భుతమైన క్యాచ్ తో అబ్బుర పరిచాడు. తన చూపంతా బంతి పైనే ఉందన్నట్టు పక్షి లాగా ముందుకు డైవ్ చేస్తూ గాల్లో బంతిని ఒడిసి పట్టుకున్నాడు.
ఇది కూడా చదవండి: ద్రవిడ్‌కు జిరాక్స్ కాపీనా ఏంటి..! మిస్టర్ డిపెండబుల్ కొడుకు వీడియో వైరల్
ఆ క్యాచ్ బాధితుడు, సఫారీ బ్యాటర్ క్లాసెన్ తో పాటు ఆ దృశ్యం చూసిన వారంతా అవాక్కయ్యారు. ఇక కామెంటేటర్లైతే ఇది క్యాచ్ ఆఫ్ ద సిరీస్ అంటూ పొగడ్తలతో ముంచేశారు. ప్రేక్షకులు కేరింతలతో హోరెత్తించారు. క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.