శాడిస్ట్ మొగుడు.. నెలరోజులుగా భార్య చేత బాత్రూం నీళ్లు తాగించిన భర్త చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను నెల రోజులుగా గదిలో బంధించి భర్త తాళం వేశాడు. తిండి తిప్పలు లేక కేవలం బాత్ రూం నీళ్లతోనే కడుపు నింపుకుంటూ బతికి బయటపడింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారనే కోపంతో ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. భర్త శాడిజాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By Vijaya Nimma 14 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి జీవితాంతం తోడుగా ఉంటానని నిఖా చేసుకున్న భర్తే.. శాడిస్ట్‌గా మారాడు. రెండు కాన్పుల్లోనూ ఆడపిల్లలు పుట్టారనే కోపంతో దారుణానికి ఒడిగట్టాడు. నెల రోజులుగా తిండి కూడా పెట్టకుండా గదిలో పెట్టి తాళం వేశాడు. చివరకు బాత్రూంలో వచ్చే నీళ్లు తాగి ప్రాణాలతో బయటపడింది. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో ఈ దారుణ ఘటన జరిగింది. చాంద్ బాషా అనే వ్యక్తి పలమనేరు ఆర్టీసీ డిపోలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆరేళ్ల క్రితం ఇతడికి పట్టణంలోని కాకతోపు కాలనీకి చెందిన సబీహాతో పెళ్లయింది. తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టిందని భార్యతో నిత్యం గొడవపడేవాడు. భర్త పెట్టే హింసలు తట్టుకోలేక చాలాసార్లు సబీహా పుట్టింటికి వెళ్లిపోయింది. రాక్షసుడిగా మారిన భర్త పెద్దలు నచ్చజెప్పడంతో తిరిగి భర్త దగ్గరకు వచ్చింది. అయినా కానీ భర్తలో మార్పు రాకపోవడంతో పలమనేరి సీఐకి ఫిర్యాదు చేశారు. భార్యను బాగా చూసుకోవాలని ఆయన కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా అతడిలో మార్పురాలేదు. ఈలోపు ఆమె మళ్లీ గర్భవతి కావడం జరిగిపోయింది. రెండో కాన్పులోనూ అమ్మాయి పుట్టడంతో సబిహాను మరింత హింసించడం మొదలు పెట్టాడు. వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ వారిని నేరుగా ఇంటికే తీసుకువచ్చి గడిపేవాడు. ఈక్రమంలో వేరే మహిళతో చనువుగా ఉన్న సమయంలో భార్య చూసిందంటూ ఆమె తల పగలగొట్టి, చేతులు విరిచాడు. నెలరోజులుగా బాత్రూం నీళ్లు తాగి.. అనంతరం ఆమెను గదిలో బంధించి తాళం వేశాడు. తిండి కూడా పెట్టకుండా శాడిస్ట్‌లాగా ప్రవర్తించేవాడు. నెల రోజుల నుంచి తమ కుమార్తె నుంచి కనీసం ఫోన్ కూడా రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సాయంతో దుర్మార్గుడి ఇంటికి వెళ్లి చూడగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నెలరోజులుగా భార్యను గదిలో పెట్టి బంధించినట్లు తేలడంతో భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు తిండి కూడా పెట్టకపోవడంతో చేసేదేమీ లేక బాత్ రూమ్‌లో వచ్చే నీటిని తాగుతూ ప్రాణాలు దక్కించుకుంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి