Sadhguru: సద్గురుపై పాము దాడి.. ఒకేసారి మూడు కాట్లు!

మెదడు ఆపరేషన్ చేయించుకున్న సద్గురు అనారోగ్యానికి సంబంధించి ఓ భయంకరమైన అంశం చర్చనీయాంశమైంది. గతంలో ఆయనను నాగుపాము మూడుసార్లు కాటేసిన విషయం హాట్ టాపిక్ గా మారింది. రక్తం గడ్డకట్టడానికి అది ఒక కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.

New Update
Sadhguru: సద్గురుపై పాము దాడి.. ఒకేసారి మూడు కాట్లు!

Sadhguru: ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇటీవల అనారోగ్యం పాలైన విషయం తెలిసిందే. కాగా ఆయనకు మెదడులో బ్లడ్ గడ్డ కట్టినందువల్ల ఆపరేషన్ చేయించినట్లు ఇషా ఫౌండేషన్ అధికారికంగా ప్రకటించిది. ప్రస్తుతం సద్గురు వెంటిలేటర్ లో ఉండగా.. తాను బాగానే ఉన్నట్లు ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే సద్గురుకు సంబంధించి మరో విషయం తెరపైకొచ్చింది. పాము కాటు వల్లే ఆయనకు రక్తం గడ్డకట్టిందనే వాదన నడుస్తోంది.

ఇది కూడా చదవండి: Body Massager: దీనిని సెక్స్ టాయ్ గా పరిగణించలేం.. హైకోర్టు కీలక తీర్పు!

3సార్లు నాగుపాము కాటు..
ఈ మేరకు సద్గురు గతంలో 3సార్లు నాగుపాము కాటుకు గురయ్యారట. వాసుదేవ్‌కు 5ఏళ్ల వయసునుంచే పాములంటే చాలా ఇష్టమట. దీంతో ఇంట్లో పాములు పెంచడం మొదలుపెట్టాడు. అలా పాములు పట్టేవాడిగా పేరు తెచ్చుకుని పాకెట్ మనీ సంపాదించుకునేవాడట. ఇదే సద్గురుకు సమస్యగా మారింది. ఒకసారి ఒక కొండపై ఉన్న రాతి పగుళ్ల నుంచి నాగుపామును లాగుతున్నప్పుడు అతనిపై దాడి చేసింది. పాము తన కోరలతో జగ్గీ పాదాన్ని మూడుసార్లు కాటు వేసిందట. అయితే నాగుపాము కాటు వల్ల రక్తం గడ్డకడుతుందని సద్గురుకు ముందే తెలియడంతో రక్తాన్ని పంప్ చేసేందుకు బ్లాక్ టీ తాగేశాడట. తర్వాత బ్లాక్ టీ ప్రభావవంతంగా ఉందని నిరూపించబడి, దానివల్లే తన జీవితం రక్షించబడిందని జగ్గీ తెలిపారు. అయితే ఆయన మెదడులో రక్తం గడ్డ కట్టడానికి కారణం పాము విషమే అనే వాదనలు నడుస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు