Sadhguru: ప్రాణపాయ స్థితిలో సద్గురు.. క్లారిటీ ఇచ్చిన ఈషా ఫౌండేషన్ !

సద్గురు జగ్గీ వాసుదేవ్ తన మెదడుకు అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆయనకు బుధవారం ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను జర్నలిస్ట్ ఆనంద్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Sadhguru: ప్రాణపాయ స్థితిలో సద్గురు.. క్లారిటీ ఇచ్చిన ఈషా ఫౌండేషన్ !
New Update

Sadhguru Undergoes Emergency Brain Surgery: సద్గురు జగ్గీ వాసుదేవ్ తన మెదడుకు అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆయన బుధవాకం ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో (Apollo Hospital) ఆపరేషన్ చేయించుకున్నట్లు జర్నలిస్ట్ ఆనంద్ నరసింహన్ సోషల్ మీడియా వేదికగా వివరాలు వెల్లడించారు.

Sadhguru Undergoes Emergency Brain Surgery

అలాగే ఇషా ఫౌండేషన్ సైతం సద్గురు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ చూసి ఆయన భక్తులు, ఫాలోవర్స్ ఆందోళన చెందడంతో పోస్ట్ ను ఇషా ఫౌండేషన్ డిలిట్ చేసింది.

ఇది కూడా చదవండి: Pilot: నిద్ర రాకుండా పైలట్‌లు ఏం చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు!

ప్రాణాపాయ స్థితికి గురయ్యారు..
ఈ మేరకు ఆనంద్ ట్వీట్ పరిశీలిస్తే.. 'సద్గురు (Sadhguru) ఇటీవల ప్రాణాపాయ స్థితికి గురయ్యారు. అతను తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. అది 14వ తేదీ నాటికి చాలా తీవ్రంగా మారింది. దీని వలన మెదడులో భారీ రక్తస్రావం జరిగింది. మార్చి 17న సద్గురు నాడీ సంబంధిత స్థితి, స్పృహ స్థాయి క్రమంగా క్షీణించింది. వరుస వాంతుల కారణంగా తలనొప్పి తీవ్రమైంది. దీంతో డాక్టర్ వినిత్ సూరి సలహా మేరకు సద్గురు అత్యవసరంగా MRI చేయించుకున్నారు. అపోలో ఢిల్లీకి చెందిన వైద్యుల బృందం డాక్టర్ వినిత్ సూరి, డాక్టర్ ప్రణవ్ కుమార్, డాక్టర్ సుధీర్ త్యాగి, డాక్టర్ ఎస్ ఛటర్జీ ఆధ్వర్యంలో మెదడు వాపు, ప్రాణాంతకమైన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన కొద్ది గంటల్లోనే అత్యవసర మెదడు శస్త్రచికిత్స చేయించారు. అయన మెదడు, శరీరం ముఖ్యమైన అవయావలన్నీ మెరుగుపడుతున్నాయి. సద్గురు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా' అంటూ రాసుకొచ్చాడు.

#sadhguru-jaggi-vasudev #sadhguru
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe