Deepfake : సచిన్ కు షాక్ ఇచ్చిన కేటుగాళ్లు.. ఆ వీడియో వైరల్‌

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ బారిన పడ్డారు. ‘స్కైవార్డ్‌ ఏవియేటర్‌ క్వెస్ట్‌’ గేమింగ్ యాప్ లో డబ్బులు సంపాదించుకోవాలంటూ సూచించే వీడియో వైరల్ అయింది. వెంటనే స్పందించిన సచిన్ ఇది ఫేక్ అని కొట్టిపారేశారు. ఎవరూ నమ్మొద్దని, అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు.

Deepfake : సచిన్ కు షాక్ ఇచ్చిన కేటుగాళ్లు.. ఆ వీడియో వైరల్‌
New Update

Deepfake : ఈ మధ్యకాలంలో డీప్‌ఫేక్‌ (Deepfake) వీడియోలు సెలబ్రిటీలను కలవరపెడుతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కు సోషల్ మీడియాలో కేటుగాళ్లు షాక్ ఇచ్చారు. ఓ గేమింగ్‌ యాప్‌ను ఆయన ప్రమోట్ చేస్తున్నట్లు చూపించే వీడియో నెట్టింట దర్శనమివ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో వెంటనే స్పందించిన సచిన్ ఈ వీడియో తనది కాదంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఫేక్ గాళ్లకు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు.

సచిన్ ఆందోళన..

‘ఇవి ఫేక్ వీడియోస్. ఎవరూ నమ్మొద్దు. టెక్నాలజీని ఇలా విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం నిజంగా ఆందోళన కలిగిస్తోంది. తప్పుడు వార్తలు, వీడియోలు, ప్రకటనలు, యాప్‌లు కన్పించించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వండి. సోషల్‌ మీడియా వేదికలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి. డీప్‌ఫేక్‌ వీడియోలు, ఫేక్ ఇన్ఫర్మేషన్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి' అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టిన మాస్టర్ బ్లాస్టర్ కేంద్ర ఐటీశాఖ మంత్రి ఖాతా, మహారాష్ట్ర సైబర్‌ విభాగానికి దీనిని ట్యాగ్‌ చేశారు.

ఇది కూడా చదవండి : BIG BREAKING : ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా

‘స్కైవార్డ్‌ ఏవియేటర్‌ క్వెస్ట్‌’..

అసలు విషయానికొస్తే.. ‘స్కైవార్డ్‌ ఏవియేటర్‌ క్వెస్ట్‌’ ('Skyward Aviator Quest') పేరుతో ఉన్న గేమింగ్‌ యాప్‌ను సచిన్‌ టెండూల్కర్ ప్రమోట్ చేస్తున్నట్లుగా వీడియోలో క్రియేట్ చేశారు. ఈ యాప్‌తో భారీగా డబ్బులు సంపాదించుకొవచ్చని, ఆయన జనాలకు సూచిస్తున్నట్లు మార్ఫింగ్‌ చేశారు. దీంతో ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ అయింది.

సచిన్‌ కూతురు సారా..

ఇదిలావుంటే.. ఇటీవలే సినీ సెలబ్రిటీలతో పాటు సచిన్‌ కూతురు సారా టెండూల్కర్‌ కు సంబంధించిన డీప్‌ ఫేక్‌ వీడియో వైరల్ అయింది. యంగ్ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో సారా ఉన్నట్లు మార్ఫింగ్‌ ఫొటో నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సారా.. అపరిచితుల ప్రవర్తనతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెటిజన్లు, సెలబ్రిటీలు ఆమెకు మద్ధతుగా నిలిచారు.

#skyward-aviator-quest #sachin-tendulkar #deep-fake
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe