/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2024-09-06T155403.196.jpg)
SD18: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గతేడాది 'విరూపాక్ష' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. హర్రర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అద్భుతమైన స్టోరీ, స్క్రీన్ ప్లే తో విమర్శకుల ప్రశంసలను పొందింది. ఇక ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ #SDT18 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై SDT18 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు.
SDT18 ఐశ్వర్య లక్ష్మి ఫస్ట్ లుక్
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమా నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఈ మూవీలో కన్నడ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఐశ్వర్య పాత్రను పరిచయం చేస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఐశ్వర్య 'వసంత' అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. ఐశ్వర్య లక్ష్మీ పొన్నియన్ సెల్వన్, గార్గి, అమ్ము, గాడ్సే, కింగ్ ఆఫ్ కొత్త వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ SDT18 తో పాటు తమిళ్ లో తగ్ లైఫ్, మాలయంలో హలో మమ్మీ చిత్రాల్లో నటిస్తోంది.
A Breeze, but also a storm 🍃
Happy Birthday to our VASANTHA aka #AishwaryaLekshmi
Wishing you all the love, laughter, health and success.#SDT18pic.twitter.com/vTkK1Z2o7l
— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 6, 2024
Also Read: Emergency: 'ఎమర్జెన్సీ' మరోసారి వాయిదా.. కంగనా ఎమోషనల్ పోస్ట్..! - Rtvlive.com