Balakrishna: బాలకృష్ణ ఇంట్లో 120 లగ్జరీ వాచీలు.. ధర చూసి ఖంగుతిన్న అధికారులు

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ మాజీ డైరెక్టర్ ఎస్.బాలకృష్ణ అవినీతి దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే రూ. 100 కోట్ల అక్రమ ఆస్తుల కేసులో అరెస్టైన ఆయన ఇంట్లో 120 చాలా ఖరీదైన గడియారాలు దొరికినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Balakrishna: బాలకృష్ణ ఇంట్లో 120 లగ్జరీ వాచీలు.. ధర చూసి ఖంగుతిన్న అధికారులు
New Update

Metropolitan: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ మాజీ డైరెక్టర్ ఎస్ బాలకృష్ణ (Balakrishna) అవినీతి దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే రూ. 100 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై అవినీతి నిరోధక బ్యూరో (ACB) అధికారులు అతన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బాలకృష్ణ వద్ద 120 ఖరీదైన గడియారాలు లభించినట్లు అధికారులు వెల్లడించారు.

రాడో, రోలెక్స్..
ఈ మేరకు ఒక్కో వాచీ ధర రూ. 4 లక్షల వరకూ విలువ ఉంటుందని, కోర్టుకు ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. 'మేము రాడో, రోలెక్స్, TAG హ్యూయర్, ఇతర ఖరీదైన బ్రాండ్‌ల వంటి బ్రాండెడ్ వాచీలను అతని దగ్గర గుర్తించాం. ఈ బ్రాండెడ్ వాచీల విలువ దాదాపు రూ. 32.38 లక్షలు ఉంటుంది' అని రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. అలాగే బాలకృష్ణ నివాసంలో మరికొన్ని వాచీల ధర రూ. 1.50 లక్షలపైగానే ఉందని, వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి : AP Cabinet: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో రైతు రుణమాఫీ?

బినామిదార్ల పేరిట 8.26 కోట్లు..
అలాగే ఈ నిందితుడు రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి తదితర జిల్లాల్లో పలు ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా తన పేరు మీద కొన్ని ఆస్తులు, అతని కుటుంబ సభ్యులు, బినామిదార్ల పేరిట సుమారు 8.26 కోట్ల విలువైన ఆస్తులను రికార్డు చేయించినట్లు తేలింది. 2012-2023 మధ్య వివిధ వనరుల ద్వారా అతని ఆదాయం రూ. 2.48 కోట్లకు చేరుకుందని ఏసీబీ అధికారులు తెలిపారు.

వసూలు రాజా..
ఇక అక్రమంగా డబ్బు సంపాదించే క్రమంలో అతనితో ఎంతమంది సంబంధం కలిగి ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనలపై ఆయనకు సరైన అవగాహన ఉంది. అతను బిల్డర్ల నుంచి వారి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లలో అనేక పద్ధతుల్లో డబ్బు వసూలు చేసేవాడని ACB బృందం STOI కి వివరించింది.

#hyderabad #s-balakrishna #120-luxury #expensive-watches
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe