రష్యాకు బిగ్ షాక్.. చంద్రుడిపై కుప్పకూలిన లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్‌

రష్యా లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్‌ కుప్పకూలింది. చంద్రుడిపై కూలిపోయిందని రష్యా అధికారులు అధికారికంగా తెలిపారు. చంద్రుని దక్షిణ ధ్రువంలో సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సి ఉండగా.. తాజాగా క్రాష్ అయినట్లు వెల్లడించారు. ల్యాండింగ్‌ సమయంలో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో కుప్పకూలిందని పేర్కొన్నారు.

New Update

దాదాపు 50 ఏళ్ల తర్వాత రష్యా ప్రయోగించిన మొదటి లూనార్ ల్యాండర్ ఇది. ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకారం చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించాల్సి ఉండగా.. ప్రీ-ల్యాండింగ్ ఫెయిల్ అయ్యింది. రోబోటిక్ వ్యోమనౌక నిన్న(ఆగస్టు 19) కక్ష్యలోకి ప్రవేశించాల్సి ఉంది. ఈ క్రమంలో లూనా-25లో ఎమర్జెన్సీ తలెత్తింది. అందుకే వ్యోమనౌక అనుకున్న విధంగా కక్ష్యలోకి ప్రవేశించలేదని రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ ఓ ప్రకటనలో తెలిపింది. నాసా, ఇస్రో లాంటి అంతరిక్ష సంస్థలతో రేసులో పాల్గొనేందుకు దూసుకొచ్చిన రష్యా గత వారం క్రాఫ్ట్‌ను ప్రారంభించింది. ఇది ఆగస్టు 21న(రేపు) చంద్రుని దక్షిణ ధృవం మీద ల్యాండ్ అవుతుందని ముందుగా రాస్‌కాస్మోస్ చెప్పగా అది బెడిసికొట్టింది.

మరోవైపు చంద్రయాన్‌-3 జాబిల్లికి అది దగ్గరలో ఉంది. ఆగస్టు 17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విజయవంతంగా విడిపోయింది. ఈ ప్రక్రియ పూర్తికావడంతో ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి చుట్టూ సొంతంగా తిరగడం ప్రారంభించింది. ఇవాళ (ఆగస్టు 20) తెల్లవారుజామున చంద్రయాన్-3 మరో కీలక ఘట్టం పూర్తిచేసింది. తెల్లవారుజాము 2గంటల నుండి 3 గంటల మధ్య రెండో, చివరి డీ-బూస్టింగ్‌ను విజయవతంగా కంప్లీట్ చేసింది. సాంకేతిక పరిభాషలో, డీబూస్టింగ్ అంటే అంతరిక్ష నౌక వేగాన్ని తగ్గించే ప్రక్రియ. చంద్రుడికి దగ్గరగా ఉన్న బిందువు (పెరిలున్) 30 కి.మీ వద్ద నుంచి సుదూర బిందువు (అపోలున్) 100 కి.మీ మధ్య ఉంటుందని అర్థం. చంద్రయాన్-3 తన రెండో, చివరి డీబూస్టింగ్‌ను ఈరోజు పూర్తి చేసింది.

Advertisment
తాజా కథనాలు