Chandrayaan-3: పాపం పుతిన్.. మనకి ఫ్రెండే కానీ.. ఇస్రో గెలుపును జీర్ణించుకోలేకపోతున్నారట!

చంద్రయాన్‌-3 ల్యాండర్‌ జాబిల్లిపై అడుగుపెట్టడంతో ఇస్రో కీర్తి విశ్వవ్యాప్తంగా మరింత పెరిగింది. చంద్రయాన్-3 ల్యాండింగ్‌ విషయాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు సైతం ప్రయారిటి ఇవ్వగా.. రష్యా మాత్రం చూసి చూడనట్టు ప్రవర్తించింది. నిజానికి రష్యా, ఇండియా బంధం చాలా స్ట్రాంగ్‌. కానీ మూడు రోజుల క్రితమే రష్యా మూన్‌ మిషన్‌(లూనా-24) చివరి మెట్టుపై బోల్తా పడడంతో పుతిన్‌ అప్‌సెట్‌ అయ్యారు.

New Update
Chandrayaan-3: పాపం పుతిన్.. మనకి ఫ్రెండే కానీ.. ఇస్రో గెలుపును జీర్ణించుకోలేకపోతున్నారట!

కొంతమంది ఫ్రెండ్స్‌ ఉంటారు.. అన్నివేళల తోడునీడగా ఉంటారు.. కష్టాల్లో సాయం చేస్తారు.. ఆపదలో ఆదుకుంటారు.. కానీ వాళ్లకి దక్కనది మనకి దక్కితే తట్టుకోలేరు.. ముఖం మాడ్చుకుంటారు.. మౌనంగా ఉండిపోతారు.. లోలోపల ఏడుస్తారు.. ఇదో వెరైటీ టైప్‌ ఆఫ్‌ మైండ్‌సెట్‌.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని చూసి కొంతమంది ఇలానే గుసగుసలాడుకుంటున్నారు. చంద్రయాన్‌-3 సక్సెస్‌ అవ్వడం అయ్యాగారికి ఏం ఇష్టం లేనట్టుంది.. ఎందుకంటే మూడు రోజుల ముందే కదా రష్యా లూనా-25 అస్సాం అయ్యింది. ఇండియా కంటే ముందుగా జాబిల్లిపై కాలు మోపాలని భావించిన పుతిన్‌కి దిమ్మదిరిగి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది.. నిజానికి అంతరిక్ష ప్రయోగాలు సక్సెస్‌ అయినా అవ్వకపోయినా చేసిన ప్రయత్నానికి అభినందించాల్సిందే. ఇదే స్పోరిటివ్‌నెస్‌. కానీ రష్యా మాత్రం ఈ విషయంలో కాస్త కుళ్లుబోతుతనం చూపించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అసలు కవరేజే లేదు:
ఇస్రో సాధించిన విజయాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఓవైపు అంతర్జాతీయ మీడియా సంస్థలు భారత్‌ని కీర్తిస్తుంటే.. మరోవైపు రష్యా మాత్రం అసలు కవరేజీ ఇవ్వలేదు. అంతర్జాతీయ వార్తా వెబ్‌సైట్లలో బ్యానర్‌ ఐటెమ్‌గా కనిపించిన మన ఇస్రో విజయం.. రష్యా బ్లాగుల్లో చాలా సేపటివరకు అసలు హోం పేజీలోనే కనపడలేదు. RT(Russia Today)లో మాత్రం ల్యాండింగ్‌ జరిగిన గంట తర్వాత వార్త కనిపించింది. అది కూడా మొక్కుబడిగా పబ్లిష్‌ చేసినట్టు ఉందని వెస్ట్రర్న్‌ మీడియా అంటోంది. మరోవైపు దొరికిందే ఛాన్స్‌ అని రష్యాకి చురకలంటిస్తూ యూకే మీడియా పలు వార్తలను ప్రచురించింది. mirror.co.uk పుతిన్‌ ఓడిపోయాడంటూ లీడ్‌ పెట్టింది.

నిజానికి ఇండియా-రష్యా చాలా మంచి స్నేహితులు. ప్రతి విషయంలోనూ కలిసి అడుగులు వేసే దేశాలు. ఇటివలి కాలంలో అమెరికాతోనూ ఇండియా మంచి రిలేషన్స్‌ మెయింటైన్‌ చేస్తున్నా.. రష్యా మాత్రం ట్రెడిషనల్‌గా ఇండియాకి మంచి ఫ్రెండ్‌. రష్యా-ఇండియా బంధం చాలా గట్టిది. లూనా-24 తుది మెట్టుపై బోల్తా పడడంతో పాటు.. ఇటివలి కాలంలో రష్యా అంతరిక్షంలో వెనకపడిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. స్పేస్‌ పరంగా ఫెయిల్యూర్స్‌ ఎక్కువగా ఉండడంతో ఏకంగా ఎంక్వైరీలు కూడా వేయించింది పుతిన్‌ సర్కార్‌. ఇటు చంద్రుడి దక్షిణ ధృవంపై ఇండియా కాలు మోపిన తొలి దేశంగా నిలవడం.. ఇస్రో కంటే ముందుగా జాబిల్లిపై అడుగుపెట్టాలని భావించిన రష్యా మిషన్‌ ఫెయిల్ అవ్వడం పుతిన్‌ని కాస్త అప్‌సెట్ చేసిందన్న ప్రచారం జరుగుతోంది.

Advertisment
తాజా కథనాలు