Yarlagadda: కాయ్ రాజా కాయ్.. యార్లగడ్డ పార్టీ మార్పుపై బెట్టింగ్‌!

గన్నవరం రాజకీయాలు హీటెక్కుతున్నాయి. యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతుండగా.. ఇవాళ ఆ విషయం గురించి ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. గన్నవరం నియోజకవర్గంలోని దాదాపు 2,000మంది కార్యకర్తలతో ఆయన భేటీ అవుతున్నారు. ఈ మీటింగ్ తర్వాత తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తారన్న ఉహాగానాలు వినిపిస్తున్నాయి.

Yarlagadda: కాయ్ రాజా కాయ్.. యార్లగడ్డ పార్టీ మార్పుపై బెట్టింగ్‌!
New Update

Yarlagadda to join TDP? : క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగులు చూశాం.. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులపై బెట్టింగులు చూశాం.. సినిమా హిట్ కొడుతుందంటూ, సినిమా ఫ్లాప్ అవుతుందంటూ కాసుకున్న బెట్టింగుల గురించి విన్నాం. కానీ ఒక వ్యక్తి పార్టీ మారుతాడా లేదా అనే అంశంపై బెట్టింగులు జరగడం ఎక్కడైనా చూశారా? ఇది ఎక్కడో జరుగుతున్న తతంగం కాదు.. మన గన్నవరంలోనే నడుస్తున్న ట్రేండ్‌. భారీ బెట్టింగులకు గన్నవరం వేదికైంది. 2019లో జరిగిన ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశంలో చేరుతారంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇదే సమయంలో బెట్టింగ్‌(betting) బాబులు రంగంలోకి దిగిపోయారు. యార్లగడ్డ(yarlagadda) టీడీపీ తీర్థం పుచ్చుకొనున్నారని కొంతమంది బెట్టింగ్‌లు కడుతుంటే.. లేదు యార్లగడ్డ వైసీపీలోనే కొనసాగుతారంటూ మరికొంతమంది బెట్‌ వేస్తున్నారు.

తేలేది నేడే:
యార్లగడ్డ వెంకట్రావు పార్టీ మారుతారా లేదా అన్నదానిపై ఇవాళ (ఆగస్టు 13) క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇవాళ యార్లగడ్డ నిర్వహించనున్న సమావేశానికి ఆయన అనుచర వర్గం మొత్తం తరలిరానుంది. 2014, 2019 ఎన్నికలలో పార్టీ కోసం పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం అని బోర్డులు ఏర్పాటు చేశారు. గన్నవరంలో ఎస్‌ఎం కన్వెన్షన్ ప్రాంగణం మొత్తం యార్లగడ్డ ఫ్లెక్సీలతో నిండిపోయింది. గన్నవరం నియోజవర్గం నుంచి 2,000 మంది కార్యకర్తలతో సమావేశం అవునున్నారు యార్లగడ్డ. గత ఎన్నికల్లో తనకు అండగా నిలబడిన వైసీపీ నాయకులు, కార్యకర్తలను సమా వేశానికి హజరయ్యేలా సన్నాహాలు చేశారు. ఈ మీటింగ్ తర్వాత తన భవిష్యత్‌ కార్యచరణను యార్లగడ్డ ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది.

వైసీపీకి షాక్‌!
2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగారు వల్లభనేని వంశీ. వైసీపీ నుంచి పోటి చేసిన యార్లగడ్డ వంశీపై ఓడిపోయారు. ఇక ఆ తర్వాత మారిణ సమీకరణలతో వంశీ వైసీపీకి సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో వంశీతో యార్లగడ్డకు శత్రుత్వం ఏర్పడింది. అమెరికా నుంచి గన్నవరం తీసుకొచ్చిన తనను జగన్‌ అన్యాయం చేయరని ఇన్నాళ్లు చెబుతూ వచ్చిన యార్లగడ్డ ఇప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన అనుచర వర్గంతో సమావేశం అయిన తర్వాత ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ నెల 19న టీడీపీ యువనేత నారా లోకేశ్‌ పాదయాత్ర ఎన్టీఆర్‌ జిల్లాలోకి ప్రవేశించనుండగా.. ఆయన సమక్షంలోనే తెలుగుదేశం కండువా కప్పుకోవాలని యార్లగడ్డ భావిస్తున్నట్టు సమాచారం.

#gannavaram #yarlagadda-venkatrao #vallabhaneni-vamshi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe