Loksabha elections: అక్టోబర్‌లో లోక్‌సభ రద్దు? ముందస్తు ఎన్నికలు ఫిక్స్..?

ఇండియా కూటమికి చెక్‌ పెట్టేలా బీజేపీ భారీ స్కెచ్‌ వేస్తున్నట్టు అర్థమవుతోంది. ముందస్తుపై ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. అక్టోబర్‌లో లోక్‌సభ రద్దవుతుందని.. జనవరిలో ముందుస్తు ఎన్నికలు జరగుతాయని తెలుస్తోంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజులపాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.

New Update
Loksabha elections: అక్టోబర్‌లో లోక్‌సభ రద్దు? ముందస్తు ఎన్నికలు ఫిక్స్..?

Loksabha elections: కేంద్రంలో మూడోసారి అధికారం కోసం బీజేపీ ఎత్తుగడ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. 'INDIA' కూటమికి చెక్‌ పెట్టేలా బీజేపీ భారీ స్కెచ్‌ వేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ముందుస్తుపై ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అక్టోబర్‌లో లోక్‌సభ రద్దవుతుందని.. డిసెంబర్‌ లేదా జనవరిలో ఐదు రాష్ట్రాలతో పాటే లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయన్న టాక్ వినిపిస్తోంది. రేపు ముంబైలో ఎన్డీఏ కూటమి పార్టీల సమావేశాం కానున్నాయి. భాగస్వామ్య పార్టీలకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా దిశానిర్దేశం చేయనున్నారు. ఇక సెప్టెంబర్‌ 18 - 22 మధ్య పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరుగనున్నట్టు కేంద్ర పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఇప్పటికే ప్రకటించారు. ముందస్తు ఎన్నికలపై ఇప్పటికే మమతా, నితీష్‌ కామెంట్స్‌ చేశారు. బీజేపీ ఇప్పటికే హెలికాప్టర్లు బుక్‌ చేసిందని దీదీ చురకలంటించారు.

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు:

సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజులపాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లోనే ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహిస్తారు. ఇవి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఒక్కసారి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం జరిగింది. దాదాపుగా 15 ఏళ్లలో ఎప్పుడూ కూడా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించలేదు. మణిపూర్ అంశంతో గత పార్లమెంట్ సమావేశాల్లో సరైన చర్చలు జరగకపోవడం కారణంగానే ఈసారి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండడంతో ఇప్పుడు ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంపై కేంద్రం వ్యూహం ఏంటోనని రాజకీయ పార్టీలు విపక్ష పార్టీలు ఆలోచనలో పడ్డాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సాధారణంగా నవంబర్ చివరి వారంలో ప్రారంభమవుతాయి.

సెషన్లు జనరల్‌గా ఎప్పుడు జరుగుతాయి?

➼ బడ్జెట్ సెషన్ (ఫిబ్రవరి-మే)

➼ వర్షాకాల సెషన్ (జూలై-ఆగస్టు)

➼ శీతాకాల సెషన్ (నవంబర్-డిసెంబర్)

రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 ప్రకారం, పార్లమెంటు సంవత్సరానికి కనీసం రెండుసార్లు సమావేశాలు నిర్వహించాలని ఆదేశించింది. రెండు సమావేశాల మధ్య గ్యాప్ ఆరు నెలలకు మించకూడదు.
మరోవైపు ప్రత్యేక సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమై కొత్త భవనంలో ముగుస్తాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గణేష్ చతుర్థి సందర్భంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తేదీలను ప్రభుత్వం ఎంపిక చేయడం తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందని శివసేన (యుబిటి) ఎంపి ప్రియాంక చతుర్వేది అన్నారు.

ALSO READ: సోనియా గాంధీని కలిసిన వైఎస్ షర్మిల..విలీనం ఖరారే!!

Advertisment
Advertisment
తాజా కథనాలు