Married Life: పెళ్లైన తర్వాత ప్రేమ తగ్గకుండా ఉండాలంటే ఈ రూల్స్ ఫాలో అవ్వండి! పెళ్లి అనేది ఒక అందమైన బంధం.దంపతులకు మొదటి రోజుల్లో వైవాహిక బంధం చాలా అందంగా, ఉత్సాహంగా ఉంటుంది. కానీ కాలం గడిచే కొద్దీ ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గిపోవచ్చు.అయితే మ్యారీడ్ లైఫ్‌లో లవ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే, కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకుందాం. By Durga Rao 16 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి పెళ్లి (Marriage) అనేది ఒక అందమైన బంధం. దంపతులకు మొదటి రోజుల్లో వైవాహిక బంధం చాలా అందంగా, ఉత్సాహంగా ఉంటుంది. కానీ కాలం గడిచే కొద్దీ ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గిపోవచ్చు. కొత్తలో ఉన్నంత ప్రేమ ఉండకపోవచ్చు. చిన్న సమస్యలు, గొడవలు, వివాదాలు కూడా తలెత్తవచ్చు. రోజువారీ జీవితంలోని ఒత్తిడి కారణంగా పెళ్లయిన కొత్తలో ఉన్నంత రొమాంటిక్‌గా ఉండక లేకపోవచ్చు. అయితే మ్యారీడ్ లైఫ్‌లో లవ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే, కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకుందాం. ప్రేమ అంటే కేవలం గొప్ప పనులు చేయడం మాత్రమే కాదు. చిన్నచిన్న విషయాలను కూడా గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. అలానే భాగస్వామికి ఉన్న సిల్లీ లేదా వింత అలవాట్లను యాక్సెప్ట్ చేయాలి. మానేయమని బలవంతం చేయవద్దు. వారి అలవాట్లను అసహ్యించుకోకూడదు. నిజానికి పార్ట్‌నర్ వింత, విచిత్ర అలవాట్లే వైవాహిక బంధాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. డేట్ నైట్లు ప్రేమను పెంపొందించడానికి చాలా ముఖ్యమైనవి. కానీ డేట్ నైట్లు అంటే కేవలం క్యాండిలైట్ డిన్నర్స్, వెన్నెలలో కలిసి నడవడం మాత్రమే కాదు. ట్రామ్‌పోలిన్ పార్కులు, పెయింట్‌బాల్ బ్యాటిల్స్‌కు వెళ్లడం లేదా సొంత నగరంలో టూర్ ప్లాన్ చేయడం వంటి కొత్త విషయాలను ప్రయత్నించవచ్చు. తద్వారా డేట్ నైట్స్‌కు కొంత సరదా, స్పష్టతను జోడించవచ్చు.భాగస్వామికి కనిపించేలా అనుకోని ప్రదేశాలలో సీక్రెట్ మెసేజ్లను డ్రాప్ చేయాలి. వారి లంచ్‌బాక్స్‌లో లవ్ కోట్స్‌తో స్టిక్కీ నోట్‌లను దాచి ఉంచాలి. పార్ట్‌నర్ దిండు కింద ఒక స్వీట్ మెసేజ్ ఉంచాలి లేదా చాక్లెట్ వంటి ఆశ్చర్యకరమైన వస్తువుకు వారి కనుగొనేలా పెట్టాలి. లేదంటే ఆ వస్తువును వారు కనిపెట్టేలా కొన్ని మార్గాలను నోట్స్‌లో రాసి అందించాలి. ఒక రొమాంటిక్ హంట్ బంధాన్ని బాగా బలపరుచుతుంది, కనిపెట్టాక ఇద్దరు హగ్స్ ఇచ్చుకుంటూ ప్రేమను వ్యక్తపరచవచ్చు. నవ్వుతూ ఉండటం నవ్వు ఒక మంచి మెడిసిన్ అని చెబుతారు. పెళ్లయిన తర్వాత, బంధం దృఢంగా, ఎప్పటికీ చీలిపోకుండా ఉండాలంటే ఆలుమగలు కలిసి సంతోషంగా నవ్వుతూ ఉండాలి. జీవితం కష్టంగా, భారంగా అనిపించినప్పుడు కూడా ఒకరినొకరు నవ్వించాలి. జోకులు చెప్పుకోవాలి. ఆటపాటలు కూడా ముఖ్యమే. హాస్యరసాన్ని బయటకు తీయడానికి ఎప్పుడూ భయపడకూడదు. కలిసి నవ్వుతున్న జంటలు ఎక్కువ కాలం కలిసి ఉంటారు. నవ్వుతూ ఉండటం వల్ల ముఖంపై ముడతలు కూడా రావు. ప్రేమ కొత్తగా.. దాంపత్య జీవితంలో ప్రేమకు రోజూ ప్రాధాన్యత ఇవ్వాలి. భాగస్వామిని ముద్దాడాలి. అన్ని విధాలుగా ప్రేమను వ్యక్తపరచాలి. పడకగదిలో మీలోని రొమాంటిక్ యాంగిల్‌ను బయటకు తీయడానికి భయపడవద్దు. * సహాయం కష్ట సమయంలో ఉన్నప్పుడు, లైఫ్ పార్ట్నర్ సహాయం అడగాలి. ఇష్టమైన కామెడీ జంట లేదా సినిమా పాత్రల వంటి దుస్తులు ధరించి కపుల్స్ థెరపీకి వెళ్లాలి. తద్వారా పెద్ద సమస్యలను చిరునవ్వుతో ఎదుర్కోవచ్చు. సాహసాలు దూర ప్రాంతాలకు ప్రయాణించడం, కొత్త అభిరుచులను అన్వేషించడం లేదా పర్ఫెక్ట్ పిజ్జా జాయింట్‌ను కనుగొనడానికి సాహసోపేత ప్రయాణం చేయడం వంటివి రిలేషన్‌షిప్‌లో ఉండాలి. జీవిత భాగస్వామితో కలిచి అడ్వెంచర్స్ ట్రై చేయాలి. ప్రేమించే వ్యక్తితో పంచుకునేది అన్నింటికంటే గొప్ప సాహసం అని గుర్తించాలి. #relationship #wife-and-husband #love మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి