ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేశారు: బోడే రామచంద్ర యాదవ్

ఏపీలో మరొ కొత్త పార్టీ పురుడు పోసుకుంటోంది. ఈ కొత్త పార్టీతో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయంటున్నారు. అయితే ఈ పార్టీ ప్రారంభంతో ప్రజా రాజకీయం మొదలైందని.. రాష్ట్రాన్ని పాలించిన నాయకులే దోపిడీ చేశారే తప్ప బడుగలకే ఏం చేయలేదన్నారు బోడే రామచంద్ర యాదవ్‌. దోపిడీ చేసేవారు.. రాష్ట్ర సంపదను దోచుకునేవారికి పాలించే హక్కు లేదన్నారు.

New Update
ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేశారు: బోడే రామచంద్ర యాదవ్

Ruined government systems Bode Ramachandra Yadav

కొత్తపార్టీకి రంగం సిద్ధం
రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పాలించిన నాయకులు దోపిడీ చేశారని బోడే రామచంద్ర యాదవ్‌ వ్యాఖ్యనించారు. ప్రజలు కొత్త రాజకీయ వ్యవస్థను కోరుకుంటున్నారని.. దోపిడీ రాజకీయాలు, హత్య రాజకీయాలు చేస్తూ ప్రజలు వంచిచాయని ఆయన అన్నారు. ఇప్పుడు వచ్చే పార్టీ ప్రజాపార్టీ అని టీడీపీ మురళీధరన్ సిఫార్సులను ఇంకా అమలు చేయలేదన్నారు. వైసీపీ అన్ని వర్గాలకు తప్పుడు హామీలు ఇచ్చి కులాల వారీగా.. మతాల వారిగా విభచించారని మండిపడ్డారు. దోపిడీ చేస్తున్న పార్టీలకు చరమగీతం పాడే రోజులు దగ్గెర్లోనే ఉన్నాయని రామచంద్ర యాదవ్‌ అన్నారు.
అన్ని దోపిడిలే

ఈ సందర్భంగా బోడే రామచంద్ర యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పుడున్న పార్టీలో హత్య, దోపిడీ రాజకీయాలు ఎక్కువగా చేస్తున్నాయన్నారు. వ్యవసాయం నీటి ప్రాజెక్టులపేరు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల అభ్యున్నతికి ఏ రాజకీపార్టీలు పనిచేయలేదన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అభివృధ్ది చెందాలంటే కొత్త రాజకీయ పార్టీ కలవాలని.. ప్రజలు మంచి చెయాలన్నారు. ఏపీలో 70 శాతం మంది ప్రజలు కొత్త పార్టీని కోరుకుంటున్నారని తెలిపారు. లకలాధి మందితో జూలై 23న గుంటూరు- విజయవాడ మధ్య ఉన్న ప్రజా చైతన్య వేదికపై కొత్త పార్టీ పురుడు పోసుకుంటుందని.. ఈ పార్టీతో ప్రజా రాజకీయం మొదలు అవబోతుందని రామచంద్ర యాదవ్‌ వెల్లడించారు.

బడుగులు వ్యవస్థను మార్చాలి

కర్నూలు కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీ కుటుంబ పార్టీ కాదని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడే పార్టీ అన్నారు. రాష్ట్ర సంపదను దోచుకున్నారు.. ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేశారే తప్ప మీరు చేస్తున్న పాలనీలో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని మండిపడ్డారు. గత 30 ఏళ్ల క్రితం 30 నుంచి 50 మంది ఇండిపెండెంట్స్ ఎంపీ, ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి నుండి పార్టీల అండ లేకుండా కనీసం వార్డు సభ్యులగా కూడా గెలిచే పరిస్థితికి వచ్చామన్నారు. రాజకీయ వ్యవస్థను కార్పొరేట్ వ్యవస్థగా మార్చారని..ఈ రాజకీయ వ్యవస్థను మార్చగల శక్తి బడుగులకే ఉందని ఆయన తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు