రానున్న లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో మరో సారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అని అన్నారు. RTV Uncensored కార్యక్రమంలో ఆయన అనేక విషయాలను పంచుకున్నారు. భువనగిరిలో తన గెలుపు ఖాయమన్నారు. అక్కడ 4 లక్షల మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో 10-12 స్థానాలు గెలుస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో లేవన్నారు.
ఇది కూడా చదవండి: DK Aruna: నా గెలుపును రేవంత్ కూడా ఆపలేడు.. డీకే అరుణ సంచలన ఇంటర్వ్యూ
ఢిల్లీలో మోదీ-భువనగిరిలో బూర అనే నినాదం అంతటా వినిపిస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రముఖల అందరి ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయన్నారు. కేటీఆర్ భాష మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కవిత అరెస్ట్ కు బీజేపీకి సంబంధం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కవిత అంశం తమకు నష్టం కలిగించిందన్నారు.
ఇప్పుడు ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారన్నారు. ఆత్మగౌరవం కోసం తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి తాను బయటకు వచ్చానన్నారు. బీఆర్ఎస్ వన్ మ్యాన్ పార్టీ అని అన్నారు. ఆ పార్టీని వీడడానికి కారణం అదే అని అన్నారు. నర్సయ్య గౌడ్ పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.