గద్దరన్న మన మధ్యలోనే ఉన్నాడు. గద్దరన్న రాసి, పాడిన పాటలు వింటుంటే మన కోసం గద్దరన్న మళ్లీ పుట్టుకొచ్చాడనే అనిపిస్తోంది.
➼ హైదరాబాద్‌లో ఆర్టీవీ, తొలివెలుగు మరోసారి సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ కళాకారుల ధూమ్ ధామ్ చేస్తున్నారు.
➼ ఈ కార్యక్రమంలో గాయకులు సోమన్న, నల్గొండ గద్దర్, మధుప్రియ, పుష్పక్క, వరం పాల్గొని.. గద్దర్ పాటలు పాడుతూ ప్రజాయుద్ధనౌకను గుర్తుకు తీసుకొస్తున్నారు. సినీయర్ జర్నలిస్ట్ రవిప్రకాశ్ ప్రజాగాయకుల మధ్యే ఉంటూ..వారి పాటలను, మాటలను వింటున్నారు.
➼ సాయిచంద్ తండ్రి వెంకట్రాములు చిన్న పిల్లాడిలా ఏడ్చేశారు. వెంకట్రాములు మాట్లాడుతూ "నేనొక కళాకారుడిగా పాత వాళ్లందరికీ తెలుసు.. కొత్త తరం వాళ్లకు సాయిచంద్ అంటేనే ఎక్కువగా పరిచయం.. ఆయన పాట అంటే అందరికీ ఇష్టం.. ఈ మధ్య వాట్సాప్‌లో చూశాను.. నేను కూడా నీ దగ్గరికి వస్తున్నారా అని గద్దర్ అంటున్నట్టు ఆ వాట్సప్ మెసేజ్‌లో ఉంది.. ఆ మెసేజ్ చూడగానే నా కన్నీళ్లు ఆగలేదు.. గద్దర్‌లో సగం వయసే ఉన్న నా కొడుకు ఆకాశం లోకి ఎగిరిపోయాడు.. ఈ గడ్డపై గజ్జల సవ్వడి చేసిన గద్దర్ అన్న నా కొడుకు దగ్గరికి వెళ్ళాడు అని అనుకుంటున్నాను.. సాయి చంద్, గద్దర్ ఇద్దరూ మరణించడం కళాకారులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.. అందరూ కన్నీటి సంద్రంలోకి వెళ్లిపోయారు.. వారిద్దరూ పైనుంచి చూస్తున్నారు.. నా వేలు పట్టుకుని నడిచిన నా కొడుకు నా పాట వింటూ పెరిగాడు.. ఇప్పుడు మళ్లీ నేను పాడే పరిస్థితి రావడం నా అదృష్టమో దురదృష్టమో తెలీదు.. మళ్లీ ఇలాంటి కళాకారులను తెలంగాణలో పుట్టాలి.. గాన సముద్రంలో మునిగేటట్టు చేయండి అని నేను అడుగుతున్నాను.... గద్దర్ శిష్యుడుగా ఆయనకు నేను నివాళులర్పిస్తున్నాను' అంటూ చాలా ఎమోషనల్ అయ్యారు వెంకట్రాములు.
ఆ గొంతు మళ్ళీ పుడితే చూడాలి- సింగర్ పుష్పక్క
గానంతో దుమ్మురేపిన మధుప్రియ
దుమ్ములేపిన ఏపూరి సోమన్న
గద్దర్‌ను దించేసిన నల్గొండ గద్దర్
చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన
సాయిచంద్ తండ్రి వెంకట్రాములు
➼ నా కొడుక్కి తోడుగా..గద్దరన్న వెళ్లాడంటూ సాయిచంద్ తండ్రి ఎమోషనల్ అయ్యారు.
అప్పట్లో గద్దరన్నను చూస్తే గజగజే!.. గద్దరన్నను చూస్తే వణుకు పుట్టేది.. పాట పాడుతూ చిందులేస్తూ..గోరటి వెంకన్న విశ్వరూపం.. గోరటి వెంకన్న కవిత వింటే.. కన్నీళ్లు పెట్టాల్సిందే..