ప్రజాయుద్ధనౌక గద్దరన్నకు RTV నివాళి.. లైవ్..!
వాగ్గేయకారుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు ఆర్టీవీ నివాళులర్పిస్తోంది. గద్దర్‌పై తమకున్న ప్రేమను చూపిస్తోంది. అశేష జనసందోహం నిన్న గద్దర్‌కి కన్నీటి నివాళులర్పించింది. కడసారిగా గద్దర్‌ను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు ఉద్యమ వీరుడికి నివాళులు అర్పించారు. గద్దర్ తీవ్రమైన గుండె వ్యాధితో గత జూలై-20న ఆస్పత్రిలో చేరారు. ఆగస్టు-3న బైపాస్ సర్జరీ చేశారు డాక్టర్లు. ఆ వ్యాధి నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తుల సమస్య రావడంతో మరణించారు. గతంలో కూడా ఊపిరితిత్తుల సమస్యతోనే ఆయన ఇబ్బంది పడ్డారు. ఊపిరితిత్తులు, మూత్ర సమస్యలు, వయసు సంబంధిత కారణాలతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గద్దర్ కన్నుమూశారు.