ప్రయత్నం మాది.. ఫలితం కాంగ్రెస్‎కు దక్కింది.. బీజేపీ ఫైర్‎బ్రాండ్ రఘునందన్ రావుతో ఆర్టీవీ ఎక్స్‎క్లూజివ్ ఇంటర్వ్యూ

తెలంగాణ బీజేపీ పేరు చెప్పగానే గుర్తొచ్చే ముఖ్యుల్లో రఘునందన్ రావు ముందుంటారు. ఆయన తన వాగ్ధాటితో, టీవీ డిబేట్ల ద్వారా విస్తృతమైన ప్రజాదరణ సాధించారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి, దుబ్బాకలో ఆయన ఓటమి తదితర అంశాలపై ఆయన ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.

New Update
ప్రయత్నం మాది.. ఫలితం కాంగ్రెస్‎కు దక్కింది.. బీజేపీ ఫైర్‎బ్రాండ్ రఘునందన్ రావుతో ఆర్టీవీ ఎక్స్‎క్లూజివ్ ఇంటర్వ్యూ

Raghunandan Rao Madavaneni: తెలంగాణ బీజేపీ పేరు చెప్పగానే గుర్తొచ్చే కొందరు ముఖ్యుల్లో రఘునందన్ రావు ముందుంటారు. తన వాగ్ధాటితో ప్రత్యర్థులను నిరుత్తురులను చేయగల సమర్థుడిగా పేరున్న ఆయన టీవీ డిబేట్ల ద్వారా విస్తృతమైన ప్రజాదరణ సాధించారు. 2020లో దుబ్బాక ఉప ఎన్నికలో నాటి అధికార టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో బీజేపీ జెండా పాతి సంచలనం సృష్టించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ విజయం రాష్ట్రంలో బీజేపీని తారస్థాయికి తీసుకెళ్లింది. అనంతరం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు, హుజురాబాద్ ఉపఎన్నికలో కూడా దుబ్బాక విజయం గట్టి ప్రభావం చూపిందనే చెప్పాలి.

అయితే, పార్టీలో అంతటి ప్రాధాన్యమున్న రఘునందన్ రావును ఈ ఎన్నికలో ముందే స్టార్ క్యాంపెయినర్ గా అధిష్టానం ఎందుకు నియమించలేదు.. ఆయన ప్రధానంగా సొంత నియోజకవర్గానికే ఎందుకు పరిమితమయ్యారు.. పార్టీలో అంతర్గత విభేదాలున్నాయా.. అధ్యక్షుడి మార్పు పార్టీ పరాజయానికి కారణమైందా.. ఎంఐఎంతో బీజేపీ లోపాయికారీ ఒప్పందం నిజమేనా.. బీజేపీ బీఆర్ఎస్ ఒకటన్న ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్మారు.. ఇలాంటి అనేక విషయాలపై రఘునందనరావు తన అభిప్రాయాలను ఆర్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆయనతో ఆర్టీవీ ఎక్స్‎క్లూజివ్ ఇంటర్వ్యూ ‘అన్ సెన్సార్డ్ విత్ రఘునందన్ రావు’ను కింది లింక్ లో చూడండి:

Advertisment
Advertisment
తాజా కథనాలు