బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్.!

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆర్మూర్‌లోని ఆర్టీసీ స్థలాన్ని అద్దెకు తీసుకున్న జీవన్‌రెడ్డి ఆ స్థలంలో షాపింగ్ మాల్‌ని నిర్మించాడు. అయితే, షాపింగ్ మాల్ అద్దెని కొంత కాలంగా కట్టడం లేదని గుర్తించిన అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్.!
New Update

Jeevan Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ( Jeevan Reddy )కి ఆర్టీసీ, విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆర్మూర్‌లోని ఆర్టీసీ స్థలాన్ని అద్దెకు తీసుకుని ఆ స్థలంలో షాపింగ్ మాల్‌ని జీవన్‌రెడ్డి నిర్మించాడు. అయితే షాపింగ్ మాల్ అద్దెని గత కొంత కాలంగా కట్టకుండా ఎగ్గొడుతున్నాడు. సుమారుగా 7.50 కోట్ల అద్దె బకాయిలు చెల్లించకుండా ఆర్టీసీ అధికారులను బెదిరిస్తూ వస్తున్నాడు. అలాగే తన షాపింగ్ మాల్‌కి విద్యుత్ బిల్లులు కూడా చెల్లించడం లేదు.

Also Read: రేవంత్ ప్రేమ ‘గీతం’.. వాళ్లది లవ్ ఎట్ ఫస్ట్ సైట్

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం, జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేగా కావడంతో కొంతకాలంగా అధికారులకు పేరుకుపోయిన బకాయిలను కట్టడం లేదు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ లేకపోవడం, ఎమ్మెల్యేగా కూడా జీవన్‌రెడ్డి ఓడిపోయారు. ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆర్టీసీ , విద్యుత్ అధికారులు రంగంలోకి దిగి జీవన్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి షాపింగ్ మాల్‌‌కి విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా మారిందన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో  ఆర్మూరులో ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకుని మాల్ నిర్మించారు. నిబంధనల ప్రకారం అద్దెలు చెల్లించాల్సి ఉన్నా చెల్లించడం లేదు.. కరెంట్ బకాయిలు కూడా చెల్లించడం లేదు. కానీ ఆ మాల్ లోని ధియేటర్లను.. దుకాణాలను అద్దెకు ఇవ్వడం ద్వారా భారీ ఆదాయాన్ని పొందుతున్నారు. కానీ ఇంత కాలం అధికారంలో ఉండటం వల్ల ఆర్టీసీ అధికారులు.. కరెంట్ ఉద్యోగులు .. గట్టిగా అడగలేకపోయారు. ఏమైనా అంటే ప్రభుత్వం వైపు నుంచి వేధింపులు ఉంటాయన్న కారణంగా ఆగిపోయారు. కానీ పది కోట్లకుపైగా రావాల్సి ఉండటంతో ప్రభుత్వం మారగానే అధికారులు కొరడా ఝుళిపించారు.

#telangana #jeevan-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe