సడన్‌ బ్రేక్‌.. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ)కి చెందిన బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మధురానగర్‌లో జరిగింది. కార్మికనగర్‌కు చెందిన పూజారి మల్లేష్ (49) అనే పండ్ల వ్యాపారి ఈ ప్రమాదంలో చనిపోయాడు. ఢీకొట్టిన తర్వాత బస్సు ఏకంగా 50మీటర్లు దూసుకుపోయింది. ఆ తర్వాత బస్సు సడన్‌ బ్రేక్‌ వేసి అక్కడి నుంచి డ్రైవర్‌, కండక్టర్‌ పరారయ్యారు.

New Update
సడన్‌ బ్రేక్‌.. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం  బలి..!

RTC Bus Runs Over Biker at hyderabad Madhapur one dead: హైదరాబాద్‌(hyderabad) మధురానగర్‌(madhuranagar)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్ష్యంపై అన్నివైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ బస్సు స్కూటర్‌ను ఢీకొట్టగా.. ప్రమాదంలో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దాదాపు 50 మీటర్లు వాహనదారుడిని ఈడ్చుకెళ్లింది బస్సు. సడన్‌ బ్రేకు వేయడంలో బస్సులోంచి ప్రయాణికులు కిందపడ్డారు. బస్సు సడన్‌ బ్రేక్‌ వేసి అక్కడి నుంచి డ్రైవర్‌, కండక్టర్‌ పరారయ్యారు. బోరబండ నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న బస్సు ఈ ప్రమాదానకి కారణమయ్యింది. రోడ్డుపై బస్సును నిలిపివేయడంతో ట్రాఫిక్‌ స్తంభించింది.

పండ్ల వ్యాపారి మృతి:
నగరంలోని మధురానగర్ పీఎస్ పరిధిలోని యూసుఫ్‌గూడ వద్ద ఆర్టీసీ సిటీ బస్సు స్కూటర్‌ని ఢీకొనడంతో కార్మికనగర్‌కు చెందిన పూజారి మల్లేష్ (49) అనే పండ్ల వ్యాపారి మృతి చెందాడు. మల్లేష్(mallesh) తలకు బలమైన గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేష్ కూలి పనులకు వెళ్తున్నాడు. యూసుఫ్‌గూడ వద్ద సికింద్రాబాద్‌ వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న టూ వీలర్‌ని ఢీకొట్టింది. ఇంతలో, ప్రమాదాన్ని చూసిన బస్సు డ్రైవర్ వాహనాన్ని ఆపే ప్రయత్నంతో సడన్‌ బ్రేక్‌ కొట్టాడు. దీంతో బస్సులోని ఇద్దరు మహిళలు కూడా బస్సు నుంచి రోడ్డుపై పడ్డారు. బస్సు చక్రాల కింద పడకుండా తృటిలో తప్పించుకున్నారు. ఘటనానంతరం పరారైన బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు మధురా నగర్ పోలీసులు తెలిపారు. బస్సును సీజ్ చేసి పీఎస్‌కు తరలించారు. చనిపోయిన మల్లేష్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

వేరే ప్రమాదంలో మరో ఇద్దరు మృతి:
తెలంగాణలోని పలు ప్రాంతాలు యాక్సిడెంట్లకు అడ్డాగా మారిపోతోంది. నిత్యం ఎక్కడో అక్కడా ఎవరో ఒకరు యాక్సిడెంట్లకు బలైపోతూనే ఉంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జహీరాబాద్‌లోని బీదర్ రోడ్డులో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు అవిరాజు (27), వీరేష్ (30)గా గుర్తించారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏదో సమస్య కారణంగా ట్రక్కును రోడ్డు పక్కన నిలిపి ఉంచారని, అయితే కారు నడుపుతున్న వ్యక్తి దీనిని గమనించకపోవడంతో ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు