Kurnool: ఓ చిన్న గుడిసెకు విద్యుత్ శాఖ అధికారులు బిల్లు రూపంలో కరెంట్ షాక్ ఇచ్చారు. దాదాపు డెబ్బై వేల కరెంటు బిల్లు వేయడంతో ఆ గుడిసెలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ అధికారులను ఆశ్రయించారు. అయితే, వారి నుండి ఏ స్పందన కనిపించడం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ విచిత్రం ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read: ఏపీలో సర్పంచుల ఆందోళన.. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు..అరెస్ట్ చేసిన పోలీసులు
కర్నూలు జిల్లాలో ఓ పూరి గుడిసెలో ఉంటున్నారు గంటా యేసేబు, పద్మావతి అనే దంపతులు. వారిద్దరికి నలుగురు కొడుకులు. ఆ నులుగురి కొడుకులను చదవించిన ఉద్యోగం రాలేదు. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే, జనవరి నెల కరెంట్ బిల్లు ఏకంగా రూ. 62, 969 వేలు రావడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్ అయింది. ఇంత చిన్న పూరి గుడిసెకు అంత పెద్ద మొత్తంలో కరెంట్ బిల్లు రావడమేంటని అధికారులను ఆశ్రయించిన వారు స్పందించడం లేదంటూ బాధిత మహిళ పద్మావతి వాపోతుంది.
Also Read: పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి క్లారిటీ..!
కాగా, ఎస్సీ రాయితీ ఉండడంతో గత రేండేళ్ల నుండి కరెంటు బిల్లు రాలేదని మరి ఉన్నట్టుండి జనవరి కరెంట్ బిల్లు ఇంత పెద్ద మొత్తంలో ఎలా వచ్చిందని అధికారులను ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ ఘటనపై టీడీపీ మహిళ నాయకురాలు భూమా అఖిల ప్రియ స్పందించారు. ఎస్సీ వారిని వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడమే పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.