22 Lakhs Found in APSRTC Cargo: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో APSRTC కార్గో సర్వీస్ లో నగదు లభ్యమయింది. హైదరాబాద్ నుంచి జంగారెడ్డి గూడెంకు RTC కార్గో ద్వారా రూ.22 లక్షల నగదు తరలించినట్లు తెలుస్తోంది. జంగారెడ్డిగూడెంలో తనిఖీల్లో భాగంగా పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు.
Also Read: అనపర్తి సీటుపై కొనసాగుతున్న గందరగోళం.. హాట్‌టాపిక్‌గా నల్లమిల్లి వ్యవహారం..!
ఈ ఘటనపై డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ..హైదరాబాదు నుండి జంగారెడ్డిగూడెం APSRTC కార్గో సర్వీస్ బస్సులో నగదుపై పక్క సమాచారం రావడంతోనే తనిఖీలు చేశామన్నారు. అందులో రూ. 22 లక్షల నగదు గుర్తించామన్నారు. ఈ నగదును తీసుకొస్తున్న వ్యక్తి దగ్గర సంబంధిత పత్రాలు లేకపోవడంతో ఆ నగదు సీజ్ చేసి ట్రెజరీకు పంపినట్లు వెల్లడించారు.
Also Read: అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాంలో ఢీకొన్న రెండు విమానాలు..!
ఎన్నికల కోడ్ (Election Code) నేపథ్యంలో ఏ వ్యక్తి కూడా రూ. 50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లడానికి వీలు లేదని పేర్కొన్నారు. అలాగే ఎవరైనా రాజకీయ ప్రచారాలు, మతాలను, కులాలను, పార్టీలను రెచ్చగొట్టేలా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.