APSRTC కార్గో సర్వీస్ లో రూ. 22 లక్షల నగదు లభ్యం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో APSRTC కార్గో సర్వీస్ లో నగదు లభ్యమైంది. హైదరాబాద్ నుంచి జంగారెడ్డి గూడెంకు ఆర్టీసీ కార్గో ద్వారా రూ. 22 లక్షల నగదు తరలించినట్లు తెలుస్తోంది. ఆ నగదును సీజ్ చేసి ట్రెజరీకు పంపినట్లు డిఎస్పీ రవిచంద్ర వెల్లడించారు. By Jyoshna Sappogula 07 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి 22 Lakhs Found in APSRTC Cargo: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో APSRTC కార్గో సర్వీస్ లో నగదు లభ్యమయింది. హైదరాబాద్ నుంచి జంగారెడ్డి గూడెంకు RTC కార్గో ద్వారా రూ.22 లక్షల నగదు తరలించినట్లు తెలుస్తోంది. జంగారెడ్డిగూడెంలో తనిఖీల్లో భాగంగా పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. Also Read: అనపర్తి సీటుపై కొనసాగుతున్న గందరగోళం.. హాట్‌టాపిక్‌గా నల్లమిల్లి వ్యవహారం..! ఈ ఘటనపై డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ..హైదరాబాదు నుండి జంగారెడ్డిగూడెం APSRTC కార్గో సర్వీస్ బస్సులో నగదుపై పక్క సమాచారం రావడంతోనే తనిఖీలు చేశామన్నారు. అందులో రూ. 22 లక్షల నగదు గుర్తించామన్నారు. ఈ నగదును తీసుకొస్తున్న వ్యక్తి దగ్గర సంబంధిత పత్రాలు లేకపోవడంతో ఆ నగదు సీజ్ చేసి ట్రెజరీకు పంపినట్లు వెల్లడించారు. Also Read: అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాంలో ఢీకొన్న రెండు విమానాలు..! ఎన్నికల కోడ్ (Election Code) నేపథ్యంలో ఏ వ్యక్తి కూడా రూ. 50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లడానికి వీలు లేదని పేర్కొన్నారు. అలాగే ఎవరైనా రాజకీయ ప్రచారాలు, మతాలను, కులాలను, పార్టీలను రెచ్చగొట్టేలా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. #ap-elections-2024 #apsrtc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి