2016 నవంబర్ లో డీమానిటైజేషన్ (demonitaization) పేరుతో మోడీ (Modi) ప్రభుత్వం పెద్ద నోట్లు అయినటు వంటి వెయ్యి రూపాయలు, 500 నోట్లను రద్దు చేసింది. ఆ తరువాత కొంత కాలానికి కేంద్రం రూ.2000 నోట్లను తీసుకుని వచ్చింది. అయితే దేశంలో క్లీన్ నోట్ పాలసీ (Clean note policy) కింద 2 వేల రద్దు చేయాలని మే నెలలో నిర్ణయం తీసుకుంది.
అయితే మే 23న ఈ నిర్ణయం తీసుకుంటే ఆ నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వ తేదీ వరకు సమయం ఇచ్చింది. అంటే ఆ గడువు ఇంకో 5 రోజుల్లో ముగుస్తుంది. ఇదిలా ఉంటే ఈ వారంలో బ్యాంకులకు చాలా సెలవులు ఉన్నాయి. కేవలం సోమవారం నుంచి బుధవారం వరకు మాత్రమే తెరిచి ఉంటాయి.
గురువారం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఆరోజు బ్యాంకులకు హాలీడే. మళ్లీ శుక్రవారం, శనివారం బ్యాంకులు తెరిచి ఉంటాయి. మొదటి మూడు రోజులు, ఆ తరువాత రెండు రోజులు మాత్రం 2 వేల నోట్లు మార్చుకోవచ్చు. రూ.20 వేల విలువ ఉన్న నోట్లను ఏ బ్యాంకులో నైనా మార్పిడి చేసుకోవచ్చు.
రూ. 50 వేలు రూపాయలు ఆ పైబడి నోట్లు మార్చుకోవాలంటే మాత్రం కచ్చితంగా పాన్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం..ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్న రూ. 2 వేల నోట్లలో 97 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చాయి. నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన 20 రోజుల్లోనే సుమారు 50 శాతం నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.
మార్కెట్లో ఉన్న ఇంకా 7 శాతం నోట్లు బ్యాంకులకు చేరాల్సి ఉందని ఆర్బీఐ తెలిపింది. ఇప్పటికైనా వారంతా కూడా దగ్గర్లో ఉన్న బ్యాంకులో డిపాజిట్ చేసుకోమని పేర్కొంది.